CRPF jawan: సీఆర్‌పీఎఫ్ జవాన్‌తో పాకిస్తానీ మహిళ వివాహం.. రచ్చ రచ్చ!

CRPF jawan
x

CRPF jawan: సీఆర్‌పీఎఫ్ జవాన్‌తో పాకిస్తానీ మహిళ వివాహం.. రచ్చ రచ్చ!

Highlights

CRPF jawan: ప్రేమకు సరిహద్దులుండవు అనే భావన ఎంతవరకు వాస్తవమేనో, కానీ జాతీయ భద్రత దృష్ట్యా కొన్ని సంబంధాలపై మరింత అప్రమత్తత అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

CRPF jawan: పహల్గాం దాడి అనంతరం పాకిస్తానీ పౌరుల వీసాలను రద్దు చేసిన భారత ప్రభుత్వ నిర్ణయం పలు అనూహ్య పరిణామాలకు దారి తీస్తోంది. వాటిలో మినాల్ ఖాన్ అనే పాకిస్తానీ మహిళపై కేంద్రీయ దృష్టి పడింది. మినాల్, పంజాబ్‌లోని పాక్ ప్రాంతానికి చెందినవారు. ఆమె జమ్మూలోని సీఆర్‌పీఎఫ్ జవాన్ మునీర్ ఖాన్‌ను ఆన్‌లైన్‌లో పరిచయం అయ్యి 2024 మేలో నికాహ్ జరిపారు. దాదాపు తొమ్మిదేళ్లు వేచి చూసిన తర్వాత 2025 మార్చిలో ఆమె భారతదేశానికి చేరుకుంది.

కానీ ఆమె వీసా మార్చి 22తో ముగియగా, అప్పటికే లాంగ్ టర్మ్ వీసాకు దరఖాస్తు చేసుకుంది. అయితే ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి అనంతరం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలతో ఆమె కూడా ఇతరుల్లాగే డిపోర్టేషన్‌కు గురైంది. మినాల్ ఇప్పటికే ఇంటర్వ్యూకు హాజరై, పాజిటివ్ రిపోర్ట్ హోం మంత్రిత్వ శాఖకు వెళ్లిందని ఆమె న్యాయవాది పేర్కొన్నారు.

డిపోర్టేషన్ నోటీసు రావడంతో మినాల్ అటారి-వాఘా సరిహద్దు వరకు వెళ్లింది. అయితే చివరి క్షణంలో కోర్టు నుంచి వచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో ఆమెకు ఊరట లభించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మినాల్ తిరిగి జమ్మూకు వచ్చి తన కుటుంబంతో మళ్లీ కలిసింది.

ఈ కేసు వెలుగులోకి రాగానే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓ సీఆర్‌పీఎఫ్ జవాన్ పాకిస్తానీ మహిళను వివాహం చేసుకోవడంపై ఆవేదన వ్యక్తమవుతోంది. ఇది ఒక వ్యూహాత్మక పెళ్లేనా? భద్రతా వ్యవస్థలో ఉన్న జవాన్లు ఎలా ఇటువంటి సంబంధాల్లోకి వెళ్లగలుగుతున్నారని వ్యక్తమవుతున్నాయి. కొంతమంది దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) జోక్యం అవసరమని పేర్కొంటున్నారు.

ఇక కేంద్రం నుంచి వచ్చిన తాజా ఉత్తర్వుల ప్రకారం, పాక్ పౌరులు అటారి సరిహద్దు ద్వారా పునరాగమనం చేసుకోవడానికి తాత్కాలిక అనుమతి ఉంది. ఏప్రిల్ 27 నుంచి ఆరు రోజుల్లో 786 మంది పాకిస్తానీలు, అందులో 55 మంది దౌత్య సిబ్బంది సహా భారత్‌ నుంచి వెనక్కు వెళ్లగా, పాకిస్తాన్‌ నుంచి 1,465 మంది భారతీయులు భారత్‌ చేరుకున్నారు. ఇటువంటి పరిణామాల మధ్య, మినాల్ ఖాన్ ఘటన ఒక వైవాహిక సంబంధం మాత్రమే కాదు, భద్రతా కోణంలో పరిశీలించాల్సిన అంశంగా మారింది. ప్రేమకు సరిహద్దులుండవు అనే భావన ఎంతవరకు వాస్తవమేనో, కానీ జాతీయ భద్రత దృష్ట్యా కొన్ని సంబంధాలపై మరింత అప్రమత్తత అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories