CRPF: పాకిస్తాన్ మహిళతో సీఆర్పీఎఫ్ జవాన్ రహస్య వివాహం..జవానుపై వేటు

CRPF: పాకిస్తాన్ మహిళతో సీఆర్పీఎఫ్ జవాన్ రహస్య వివాహం..జవానుపై వేటు
x
Highlights

CRPF: పాకిస్తాన్ మహిళలను పెళ్లాడిన విషయాన్ని రహస్యంగా ఉంచడమే కాకుండా వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఆమె ఇక్కడే ఉండటంతో ఓ జవానును సీఆర్పీఎఫ్ ఉద్యోగం...

CRPF: పాకిస్తాన్ మహిళలను పెళ్లాడిన విషయాన్ని రహస్యంగా ఉంచడమే కాకుండా వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఆమె ఇక్కడే ఉండటంతో ఓ జవానును సీఆర్పీఎఫ్ ఉద్యోగం నుంచి తొలగించింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం వెలుగు చూసింది. పాక్ జాతీయులు స్వదేశానికి వెళ్లిపోవాలని భారత్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె వివరాలు ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది.

సీఆర్పీఎఫ్ 41వ బెటాలియన్ కు చెందిన మునీర్ అహ్మద్ అనే జవాన్ గత ఏడాది మే నెలలో పాకిస్తాన్ కు చెందిన ఓ మహిళను సోషల్ మీడియాలో వివాహం చేసుకున్నాడు. తర్వాత ఆమె వీసాపై భారత్ కు వచ్చింది. అయితే ఈ విషయాన్ని ఉన్నతాధికారుల వద్ద దాచి ఉంచాడు. పైగా వీసా గడువు ముగిసినా ఆమె ఇక్కడే ఉంది. పహల్గామ్ ఉగ్ర ఘటనతో పాక్ జాతీయులు వెళ్లిపోవాలని ఈ మధ్యే భారత్ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఈ విషయం కాస్త గుట్టురట్టయ్యింది.

దీంతో ఉన్నతాధికారులు మునీర్ ను ఉద్యోగంలో నుంచి తొలగించారు. పాకిస్తాన్ జాతీయురాలితో వివాహం జరిగిన విషయాన్ని దాచిపెట్టడంతోపాటు ఆమె వీసా గడువు ముగిసిందని తెలిసి కూడా ఆశ్రయం కల్పించినందుకు తక్షణమే సర్వీసు నుంచి తొలగిస్తున్నామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు జాతీయ భద్రతకు విఘాతం కలిగించేలా ప్రవర్తించినందుకు ఈ మేరకు చర్యలు తీసుకున్నామని సీఆర్పీఎఫ్ ప్రతినిథి వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories