Goa Former Health Minister Dies of Covid19: కరోనాతో గోవా ఆరోగ్యశాఖ మాజీమంత్రి మృతి

Goa Former Health Minister Dies of Covid19: కరోనాతో గోవా ఆరోగ్యశాఖ మాజీమంత్రి మృతి
x
Representational Image
Highlights

Goa Former Health Minister Dies of Covid19: కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరిపై తన ప్రభావం చూపిస్తుంది..

Goa Former Health Minister Dies of Covid19: కరోనా ఎవరిని వదలడం లేదు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరిపై తన ప్రభావం చూపిస్తుంది.. తాజాగా గోవా ఆరోగ్యశాఖ మాజీ మంత్రి సురేష్ అమోన్‌కర్ (68) మృతి చెందారు.. గత కొద్దిరోజుల క్రితం అయినకి కరోనా అని సోకగా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరారు.. అక్కడ చాలా రోజులుగా చికిత్స పొందుతూ.. సోమవారం సాయంత్రం మరణించారు. దీనితో గోవా లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు..

సురేష్ అమోన్‌కర్ 1999-2002 మధ్యకాలంలో ఫ్రాన్సిస్ కో ప్రభుత్వంలో ఆరోగ్య, సాంఘీక సంక్షేమ, కార్మిక ఉపాధి శాఖల మంత్రిగా పనిచేశారు. ఆయన మొదటిసారిగా పాలీ అనే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. మనోహర్ పారికర్ ప్రభుత్వంలోనూ ఈయన మంత్రిగా కూడా పనిచేశారు...ఇక 2007 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి పైన పోటీ చేసి ఓడిపోయారు. 2012 ఎన్నికల్లో ప్రస్థుత సీఎం ప్రమోద్ సావంత్ పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సురేష్ పరాజయం పాలయ్యారు. ఆయన మృతి పట్ల గోవా సీఎం ప్రమోద్ సావంత్ సంతాపం వ్యక్తం చేశారు..

ఇక ప్రస్తుతం గోవాలో ఇప్పటి వరకు అక్కడ 1761 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 936 మంది కోలుకున్నారు. భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 22,771 కేసులు నమోదు కాగా, 467 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories