మొదటి విడతలో 3కోట్లమంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్

మొదటి విడతలో 3కోట్లమంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్
x
Highlights

ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడబోతోంది ! ఈనెల 16నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేపట్టనున్నట్లు కేంద్రం వెల్లడించింది. కరోనా కారణంగా అలసిపోయిన జీవితాలకు కేంద్రం...

ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడబోతోంది ! ఈనెల 16నుంచి వ్యాక్సిన్ పంపిణీ చేపట్టనున్నట్లు కేంద్రం వెల్లడించింది. కరోనా కారణంగా అలసిపోయిన జీవితాలకు కేంద్రం ప్రకటన భారీ ఊరట కలిగిస్తోంది.

ఇంకొన్ని రోజులు అంతే ! వ్యాక్సిన్ వచ్చేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో డ్రైరన్ నిర్వహించిన కేంద్రం టీకా ఇవ్వడం మినహా ప్రతీ అంశాన్ని పరిశీలించారు. కోవిన్ యాప్ పనితీరుతో పాటు అబ్జర్వేషన్ నుంచి వ్యాక్సినేషన్ వరకు ప్రతీ ఒక్క విషయాన్ని పరిశీలించారు. ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఎలా రియాక్ట్ అవ్వాలన్న దాని మీద కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఇంకొన్ని రోజుల్లో టీకా వస్తుందని ఇప్పటికే ప్రచారం జరగగా ఇప్పుడు పక్కా తేదీ తెలిసింది. పండుగ సమీపిస్తున్న వేళ దేశ ప్రజలకు కేంద్రం పెద్ద గుడ్ న్యూస్ చెప్పింది.

జనవరి 16నుంచి టీకా పంపిణీ చేపట్టనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రాధాన్యత క్రమంలో భాగంగా ముందుగా మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆతర్వాత వయసు పైబడిన వారు, ఇతర వ్యాధులతో బాధపడున్న మరో 27కోట్ల మందికి అందించనున్నట్లు తెలిపింది. వచ్చే వారంలో సంక్రాంతి, లోహ్రి, మగ్‌ బిహు తదితర పండగలను దృష్టిలో పెట్టుకుని జనవరి 16 నుంచి టీకా పంపిణీ ప్రారంభించాలని నిర్ణయించుకున్నామని ఓ ప్రకటనలో తెలిపింది.

దేశంలో కరోనా పరిస్థితులు, కొవిడ్‌ వ్యాక్సిన్‌పై ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత కేంద్రం టీకా సరఫరాకు సంబంధించి ప్రకటన చేసింది. కేబినెట్‌ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఇతర సీనియర్‌ అధికారులతో మోడీ రివ్యూ నిర్వహించారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో టీకా పంపిణీ సన్నాహాల గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కోవిషీల్డ్‌తో పాటు కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. వ్యాక్సిన్‌ పంపిణీ కోసం నిన్న దేశవ్యాప్తంగా డ్రైరన్‌ చేపట్టింది. ఈ డ్రై రన్‌ ఫలితాల ఆధారంగా టీకా పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇలాంటి తరుణంలో టీకా వస్తుందన్న వార్త జనాలకు భారీ ఊరట కలిగిస్తోంది. ఐతే వ్యాక్సిన్ వచ్చిందని రిలాక్స్ అవడానికి లేదని మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటించాల్సిందేనని చెప్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories