Covid19 Recovery Rate Updates: దేశంలో భారీగా పెరిగిన రికవరీ రేటు

Covid19 Recovery Rate Updates: కరోనా పైన కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుతుందని, 10 లక్షల మందిలో 657 కేసులు మాత్రమే నమోదు అవుతున్నట్టుగా

Krishna
Published on: 14 July 2020 5:33 PM IST
Covid19 Recovery Rate Updates: దేశంలో భారీగా పెరిగిన రికవరీ రేటు
X

Covid19 Recovery Rate Updates: కరోనా పైన కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుతుందని, 10 లక్షల మందిలో 657 కేసులు మాత్రమే నమోదు అవుతున్నట్టుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి రాజేష్ భూషణ్ వెల్లడించారు. ఇక ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 5.7 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారని స్పష్టం చేశారు.. ఇందులో 86% కేసులు కేవలం 10 రాష్ట్రాలలోనే నమోదు అవుతున్నట్టుగా ఆయన తెలిపారు.

ఇందులో 50 శాతం మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఉన్నాయని, మిగతా 36% కేసులు ఎనమిది రాష్ట్రాలలోనే ఉన్నాయని వెల్లడించారు. ముఖ్యంగా 20 రాష్ట్రాలలో కరోనా రికవరీ రేటు జాతీయ రేటు కంటే చాలా ఎక్కువగా ఉన్నట్టుగా వెల్లడించారు. అందులో ఉత్తర ప్రదేశ్ రికవరీ రేటు 64%, ఒడిశా 67%, అస్సాం 65%, గుజరాత్ 70%, తమిళనాడు రికవరీ రేటు 65% గా ఉన్నట్టుగా వెల్లడించారు. మే 2 నుంచి మే 30 వరకు దేశంలో కరోనా కేసులు రికవరీ కేసుల కంటే అధికంగా ఉండేవని, కానీ ఆ తర్వాత కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య భారీగా పెరిగిందని వివరించారు.



ఇక దేశంలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి తాజాగా గడిచిన 24 గంటల్లో 28,498 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 553 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి కరోనా కేసుల సంఖ్య 9,06,752కు చేరుకుంది. అయితే ఇందులో 3,11,565 యాక్టివ్ కేసులు ఉండగా, 5,71,460 మంది కొలుకున్నారు..అటు కరోనాతో పోరాడి 23,727 మంది మృతి చెందారు. జూలై 13 వరకు దేశవ్యాప్తంగా 1,20,92,503 శాంపిల్స్‌ టెస్టు చేశారు.

Krishna

Krishna

Next Story