Amit Shah: రూల్స్ పాటించకుంటే కొవిడ్‌ నియంత్రణ సాధ్యం కాదు

Amit Shah: అందరూ కలసికట్టుగా పనిచేస్తేనే కొవిడ్‌ పోరులో విజయం

Arun Chilukuri
Updated on: 30 Dec 2021 7:34 AM IST
Covid-19 instructions were given by Amit Shah | National News Today
X

జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులకు హోంశాఖ మంత్రి ఆదేశాలు

Amit Shah: ప్రజలు అలసత్వం వహిస్తూ నిబంధనలు పాటించకుంటే కొవిడ్‌ మహమ్మారిని నియంత్రించలేమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. వైరస్‌ రూపు మార్చుకుంటూ విజృంభిస్తున్నందున జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందరూ కలసికట్టుగా పనిచేస్తే కొవిడ్‌ పోరులో విజయం సాధిస్తామన్నారు.ముఖ్యంగా జనవరి 3 నుంచి పిల్లలకు టీకా ప్రారంభమవుతున్నందున 15 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలు టీకాను తప్పనిసరిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే గడువు ముగిసినా రెండోడోసు తీసుకోని వారందరూ వెంటనే తీసుకోవాలని సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story