రాజ్యసభలో కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటన

Arun Chilukuri
Updated on: 5 March 2020 12:20 PM IST
రాజ్యసభలో కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటన
X
రాజ్యసభలో కరోనాపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటన

కరోనా నియంత్రంణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్. రాజ్యసభలో కరోనాపై ఆయన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు 29 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు.

కరోనా నియంత్రంణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ఢిల్లీ, ఆగ్రా, రాజస్థాన్, తెలంగాణలో కేసులు నమోదయ్యాయని తెలిపారు. కేరళలో ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. అన్ని రాష్ట్రాలను కరోనాపై అప్రమత్తం చేసి వైరస్‌ను అడ్డుకునేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు హర్షవర్ధన్. ప్రధాని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story