అక్కడ మళ్లీ కరోనా పంజా..మళ్లీ లాక్‌డౌనేనా.?

అక్కడ మళ్లీ కరోనా పంజా..మళ్లీ లాక్‌డౌనేనా.?
x

అక్కడ మళ్లీ కరోనా పంజా..మళ్లీ లాక్‌డౌనేనా.?

Highlights

కరోనా మళ్లీ తన పంజా విప్పుతోంది. ఒకప్పుడు మహారాష్ట్రను కలవరపెట్టిన మహమ్మారి ఇప్పుడు అక్కడ తిరిగి విజృంభిస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలో మహారాష్ట్రలో...

కరోనా మళ్లీ తన పంజా విప్పుతోంది. ఒకప్పుడు మహారాష్ట్రను కలవరపెట్టిన మహమ్మారి ఇప్పుడు అక్కడ తిరిగి విజృంభిస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలో మహారాష్ట్రలో ప్రతి రోజు 3వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఫస్ట్ వీక్‌తో పోలిస్తే రెండో వారానికి వచ్చే సరికి 14శాతం కేసులు పెరిగాయి. ముంబై, పుణే నగరాల్లో ప్రతి రోజు 600పైగా కేసులు నమోదు అవుతున్నాయి. మహారాష్ట్రాతో పాటు కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఒక అపార్ట్‌మెంట్‌లో 28 మందికి కరోనా సోకడంతో ఆందోళన మొదలైంది.

బుధవారం మహారాష్ట్రలో 3వేలకు పైగా, కేరళలో 5వేల కేసులు నమోదు అయ్యాయి. పాజిటివ్ కేసులు పెరుగుతుంటే మరణాల సంఖ్య మాత్రం తగ్గుతున్నాయి. అయితే కేసులు పెరుగుతుంటే కోవిడ్ నిబంధనలపై ప్రజల్లో నిర్లక్ష‌్యం కనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో మాస్కులు ధరించే వారి సంఖ్య తగ్గిపోయారు. భౌతిక దూరం ఎవ్వరూ పాటించడం లేదు. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడాన్ని కూడా బాగా తగ్గించేశారని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైరస్ మళ్లీ విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.

పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. కోవిడ్ అనుమానిత లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది, పోలీసు, రెవెన్యూ, పురపాలక, పంచాయతీ రాజ్ సిబ్బందికి తొలి డోసు కొవిడ్ టీకాను పంపిణీ చేశారు. వైద్య సిబ్బందిలో 58 శాతం మంది మాత్రమే టీకాలను పొందగా మిగిలిన విభాగాల్లో 33 శాతం మందే టీకాను స్వీకరించారు.

మహారాష్ట్రలో కరోన కేసులు పెరుగుతుండడంతో సీఎం ఉద్దవ్ ఠాక్రే ముంబై వాసులకు హెచ్చరికలు జారీ చేశారు. సరైన జాగ్రత్తలు, నిబంధనలు పాటించకపోతే లాక్‌డౌన్‌కు రెడీగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14 జిల్లాల్లో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా పరిస్థితికి ఇంకా రెడ్‌ సిగ్నల్‌ పడకపోయినా, ఎల్లో వార్నింగ్‌ అయితే వచ్చింది. ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే ప్రమాద ఘంటికలు మోగడానికి ఎంతో సేపు పట్టదని హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories