Covaxin vaccine: భారత్ బయోటెక్ కీలక ప్రకటన
*కోవాగ్జిన్ కొత్త వేరియంట్‌ని నిలువరిస్తుందని వెల్లడి
కొత్త రకం కరోనా టెన్షన్‌తో వణికిపోతున్న వేళ.. భారత్ బయోటెక్ సంస్థ ఊపిరిపీల్చుకునే విషయం వెల్లడించింది. తాము రూపొందిస్తున్న కోవాగ్జిన్... బ్రిటన్‌లో కలకలం రేపిన కొత్త రకం వైరస్‌పై సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తెలిపింది. కొత్త వేరియంట్ వైరస్‌ను విజయవంతంగా నిలువరిస్తోందని ప్రకటించింది. ఈ విషయాన్ని ట్వీట్ చేసిన భారత్ బయోటెక్.. దీనిపై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిర్వహించిన పరిశోధన లింక్‌ను షేర్ చేసింది.
Next Story




