పిల్లలపై కొవాగ్జిన్‌ ఉత్తమ ఫలితాలు.. భారత్‌ బయోటెక్‌ ప్రకటన

Bharat Biotech: పిల్లలకు సంబంధించిన కొవిడ్‌ టీకా కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలను భారత్‌ బయోటెక్‌ సంస్థ ప్రకటించింది.

Arun Chilukuri
Updated on: 30 Dec 2021 8:46 PM IST
Covaxin Safe for Children 2-18 Says Bharat Biotech
X

పిల్లలపై కొవాగ్జిన్‌ ఉత్తమ ఫలితాలు.. భారత్‌ బయోటెక్‌ ప్రకటన

Bharat Biotech: పిల్లలకు సంబంధించిన కొవిడ్‌ టీకా కొవాగ్జిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాలను భారత్‌ బయోటెక్‌ సంస్థ ప్రకటించింది. ఫేజ్‌-2, ఫేజ్-3 క్లినికల్‌ ట్రయల్స్‌లో కొవాగ్జిన్‌ టీకా 2 నుంచి 18 సంవత్సరాల వయసు పిల్లలపై ఉత్తమ ఫలితాలు చూపిందని వెల్లడించింది. పిల్లలకు సైతం టీకా సురక్షితమేనని, పిల్లల్లో 1.7 రెట్లు ఎక్కువగా యాంటీబాడీలు ఉత్పత్తయ్యాయని తెలిపింది.

క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న పిల్లల్లో ఎలాంటి దుష్పరిణామాలు చూపలేదని పేర్కొంది. పిల్లలకు కొవాగ్జిన్‌ టీకా ఇచ్చేందుకు ఇటీవల DCGI అత్యవసర అనుమతి మంజూరు చేసింది. గత కొంతకాలంగా పిల్లలపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్న భారత్‌ బయోటెక్‌ ఈ నేపథ్యంలో వాటి ఫలితాలను ప్రకటించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story