Coronavirus Vaccine Updates: అనుకున్న టైమ్ కన్నా ముందుగానే కోవాగ్జిన్ టీకా

Coronavirus Vaccine Updates : కరోనా నిర్మూలనకు ఐసీఎంఆర్‌తో కలిసి భారత్ బయోటెక్ కంపెనీ రూపొందిస్తున్న...
Coronavirus Vaccine Updates : కరోనా నిర్మూలనకు ఐసీఎంఆర్‌తో కలిసి భారత్ బయోటెక్ కంపెనీ రూపొందిస్తున్న కొవాగ్జిన్ టీకా అనుకున్న సమయానికంటే ముందుగానే అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయ్. వచ్చే ఏడాది మార్చి తర్వాతే టీకా అందుబాటులోకి వస్తుందని తొలుత ఐసీఎంఆర్ అంచనా వేసినప్పటికీ అంతకంటే ముందుగా ఫిబ్రవరిలోనే విడుదలయ్యే చాన్స్ ఉందని ఐసీఎంఆర్ సైంటిస్ట్ తెలిపారు. ఇప్పటికే రెండు దశల ప్రయోగాలు పూర్తి చేసుకున్న ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు ఈ నెలలో ప్రారంభం కానున్నాయ్.
వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తోందని వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సైంటిస్ట్ రజనీకాంత్ అన్నారు. మూడో దశ ప్రయోగాలు కాకముందే వ్యాక్సిన్ అందజేస్తారా అన్న ప్రశ్నకు దీనిపై ఐసీఎంఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఫేజ్ 1, ఫేజ్ -2 ప్రయోగాల్లోనూ జంతువులపై జరిపిన ప్రయోగాల్లోనూ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేసిందని చెప్పారు. ఐతే మూడో దశ ఫలితాలు పూర్తి కాకుండా నూరు శాతం కచ్చితంగా పనిచేస్తుందని అప్పుడే చెప్పలేమని అన్నారు. అత్యవసర వినియోగంపై ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తోందని వివరించారు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ హైవేపై ప్రయాణికుల ఇబ్బందులు
11 Aug 2022 5:25 AM GMTకామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMT
మునుగోడు ఉపఎన్నికపై గులాబీ బాస్ ఫోకస్..
12 Aug 2022 8:38 AM GMTAirasia: స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక ఆఫర్.. రూ. 1475కే విమానంలో...
12 Aug 2022 8:05 AM GMTHanu Raghavapudi: హను రాఘవపూడి మీద కురుస్తున్న ఆఫర్ల వర్షం
12 Aug 2022 7:42 AM GMTపప్పుల ధరలలో పెరుగుదల.. కారణం ఏంటంటే..?
12 Aug 2022 7:27 AM GMTతెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ సందడి.. కొన్ని బంధాలు ప్రత్యేకమంటూ...
12 Aug 2022 7:09 AM GMT