వచ్చే ఏడాదికి భారత్‌లో వ్యాక్సిన్‌ : గగన్‌దీప్ కాంగ్‌

వచ్చే ఏడాదికి భారత్‌లో వ్యాక్సిన్‌ : గగన్‌దీప్ కాంగ్‌
x

coronavirus Vaccine 

Highlights

Coronavirus Vaccine : కరోనా వైరస్.. కంటికి కనిపించని ఈ వైరస్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన

Coronavirus Vaccine : కరోనా వైరస్.. కంటికి కనిపించని ఈ వైరస్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి చాలా మంది చనిపోగా మరికొందరు పోరాడుతున్నారు.. అయితే అన్నిదేశాల ప్రజలు మాత్రం చూసేది ఈ వైరస్ కి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని.. అయితే తాజాగా వ్యాక్సిన్‌ వచ్చే ఏడాదికి భారత్‌లో అందుబాటులోకి వస్తుందని ప్రముఖ వైద్య నిపుణులు గగన్‌దీప్ కాంగ్‌ వెల్లడించారు. కాకపోతే దీనిని 130 కోట్ల మంది భారతీయులకు అందజేయడం అనేది పెద్ద సవాలేనని అన్నారు.. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆమె ఈ వాఖ్యలు చేశారు.

దేశీయంగా పలు వ్యాక్సిన్‌లు కీలక క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు చేరుకోగా వాటిని అందరికీ చేర్చే సరైన వైద్య మౌలిక సదుపాయాలు దేశంలో లేవని ఆమె అన్నారు.. . ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏ వ్యాక్సిన్‌ సమర్ధవంతంగా పనిచేస్తుంది, ఏ వ్యాక్సిన్‌ ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనే గణాంకాలు మనకు అందుబాటులో ఉంటాయని గగన్‌దీప్ కాంగ్‌ చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుతం మూడో దశలో ఉన్న వివిధ వ్యాక్సిన్లు విజయవంతమయ్యే అవకాశం 50 శాతమే ఉందని ఆమె పేర్కొన్నారు.

ఇక అటు దేశంలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో మొత్తం 55,62,664 కేసులు నమోదయ్యాయి. ఇందులో యాక్టివ్ కేసులు 9,75,681 ఉండగా, 44,97,867 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. అటు 88,935 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 80.12 శాతంగా ఉంది. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 9,33,185 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 6,53,25,779 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories