ఉత్తర ప్రదేశ్‌లో కొత్తగా 112 మందికి కరోనా.. వారి బదిలీల నిలిపివేత..

ఉత్తర ప్రదేశ్‌లో కొత్తగా 112 మందికి కరోనా.. వారి బదిలీల నిలిపివేత..
x
Highlights

ఉత్తర ప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 112 మంది కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు నివేదించారు.

ఉత్తర ప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 112 మంది కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు నివేదించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం రోగుల సంఖ్య 3664 కు పెరిగింది. ఆగ్రాలో కొత్తగా 12 మందికి కరోనా సోకగా, ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 777 మంది ఉన్నారు. ఇక లక్నోకు చెందిన కెజిఎంయులో 10, ఫరూఖాబాద్, నోయిడాలో 6-6, కన్నౌజ్, సిద్దార్థ్‌నగర్‌లో 5-5, గోరఖ్‌పూర్, మీరట్, జలాన్‌లో 3, బిజ్నోర్ , గోరఖ్‌పూర్‌లో 2, ఫిరోజాబాద్, కాస్గంజ్, బులాండ్‌షహర్, మహూర్‌గంజ్. ఒక్కొక్కరికి కరోనా సోకినట్లు గుర్తించారు.

మొహదాబాద్‌లోని బీహార్‌కు చెందిన వందలాది మంది కూలీలు బుధవారం రోడ్డుపైకి వచ్చారు. తమను ఇంటికి పంపించే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. బీహార్ ప్రభుత్వ అనుమతి పొందిన తర్వాతే వారిని ఇక్కడి నుంచి పంపిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇదిలావుంటే పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని.. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల బదిలీలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. తదుపరి ఆర్డర్ వరకు బదిలీ ఉండదని పేర్కొంది. దీనికి సంబంధించి ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్ తివారీ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. అయితే, అనివార్య పరిస్థితుల్లో, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆమోదంతో బదిలీ చేయవచ్చని.. ఉద్యోగి పదవీ విరమణ, రాజీనామా లేదా సస్పెండ్ చేయబడితే మాత్రమే డిపార్ట్‌మెంటల్ స్థాయిలో ఖాళీలు భర్తీ చేయబడతాయని ప్రభుత్వం తెలిపింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories