దేశంలో కొత్తగా 67,735 కరోనా కేసులు!

coronavirus Updates In India : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో వివిధ రాష్ట్రాలనుంచి కొత్తగా 67,735 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Krishna
Published on: 15 Oct 2020 10:00 AM IST
దేశంలో కొత్తగా 67,735 కరోనా కేసులు!
X

coronavirus Updates In India : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.. తాజాగా గడిచిన 24 గంటల్లో వివిధ రాష్ట్రాలనుంచి కొత్తగా 67,735 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. దీనితో కరోనా కేసుల 73,07,125కు చేరుకుంది. ఇందులో యాక్టీవ్ కేసులు 8,12,390గా ఉండగా, 63,83,441మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడచిన 24 గంటలలో దేశంలో కరోనాతో కొత్తగా మరో 680 మంది మృతి చెందారు. దీనితో మరణించిన వారి సంఖ్య 1,11,266కి చేరుకుంది.

కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ అంతేస్థాయిలో రికవరీ రేటు కూడా ఉండడం సంతోషించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. దేశంలో 87.36 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉంది. యాక్టివ్ కేసుల శాతం 11.12 శాతంగా ఉంది. ఇక మరణాల రేటు శాతం 1.52 శాతానికి తగ్గింది..అటు గడచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 11,36,183 కరోనా టెస్టులు నిర్వహించారు. దీనితో ఇప్పటి వరకు దేశంలో నిర్వహించిన మొత్తం కరోనా టెస్ట్ ల సంఖ్య 9,12,26,305కు చేరుకుంది.

Krishna

Krishna

Next Story