Coronavirus Updates in India: దేశవ్యాప్తంగా తొమ్మిది లక్షలు దాటిన కరోనా కేసులు

Coronavirus Updates in India: దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే..

Krishna
Published on: 14 July 2020 10:30 AM IST
Coronavirus Updates in India: దేశవ్యాప్తంగా తొమ్మిది లక్షలు దాటిన కరోనా కేసులు
X
Coronavirus (representational Image)

Coronavirus Updates in India: దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. లాక్ డౌన్ సడలింపులు తర్వాత కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతూ ఉండడం ఆందోళనకు గురిచేస్తోంది.. ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 28,498 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 553 మంది మరణించారు. తాజా కేసులతో కలిపి కరోనా కేసుల సంఖ్య 9,06,752కు చేరుకుంది. అయితే ఇందులో 3,11,565 యాక్టివ్ కేసులు ఉండగా, 5,71,460 మంది కొలుకున్నారు..

అటు కరోనాతో పోరాడి 23,727 మంది మృతి చెందారు.. జూలై 13 వరకు దేశవ్యాప్తంగా 1,20,92,503 శాంపిల్స్‌ టెస్టు చేశారు. నిన్న ఒక్కరోజే 2,86,247 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. భారత్‌లో కరోనా వైరస్ రికవరీ రేటు 63.02శాతానికి పెరిగింది. జులై 6-12 తేదీల మధ్య 1.83 లక్షల కేసులు.. 3466 మరణాల నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

ఇక రాష్ట్రాల వారిగా కరోనా కేసులు చూసుకుంటే.. ఆంధ్రప్రదేశ్ (1935 కేసులు), ఉత్తర ప్రదేశ్ (1664), తెలంగాణ (1550), గుజరాత్ (902), మధ్యప్రదేశ్ (575), పంజాబ్ (357), ఛత్తీస్‌గఢ్ (184) రాష్ట్రాల్లో గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.

మొత్తం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా మహారాష్ట్రలోనే నమోదు అవుతున్నాయు. సోమవారం అక్కడ కొత్తగా 6497 కేసులు నమోదయ్యాయి. దీనితో అక్కడ కేసుల సంఖ్య 2,60,924కి చేరుకుంది. ఇక ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.సోమవారం 1,246 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఒక కర్ణాటకలో 2738, తమిళనాడులో 4000 కేసులు నమోదు అయ్యాయి.


Krishna

Krishna

Next Story