Coronavirus - Diwali 2021: దీపావళికి కరోనా ఎఫెక్ట్... కరోనాకు కాలుష్యం తోడైతే..

Coronavirus - Diwali 2021: దీపావళికి కరోనా ఎఫెక్ట్... కరోనాకు కాలుష్యం తోడైతే..
Coronavirus - Diwali 2021: బాణసంచా కాలుష్యంతో సాధారణం కంటే వేగంగా వ్యాప్తి...
Coronavirus - Diwali 2021: దేశవ్యాప్తంగా ప్రజలు పిల్లా పాపలతో కలిసి దీపావళి సంబరాన్ని ఉత్సాహంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. అతిపెద్ద పండుగ దీపావళికి షాపింగ్‌లు, ఇంటి అలంకరణలు, రంగు రంగుల దీపాలు సమకూర్చుకోవడంలో అంతా బిజీబిజీగా ఉన్నారు. మరోవైపు కోవిడ్ ముప్పు పొంచి ఉండటం, చలికాలం మొదలుకావడం, అందులోనూ దీపావళి రావడంతో బాణసంచా వల్ల పెరిగే వాయు కాలుష్యం కొవిడ్ ఉధృతికి కారణం కావచ్చని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు కరోనా వైరస్ ప్రభావ తీవ్రత పెరుగుతుందని, సాధారణ సమయాల్లో కంటే కాలుష్యంలో వైరస్ అతివేగంగా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ కొవిడ్ బారి నుంచి కోలుకున్న వారిలోనూ సుమారు 2,3 శాతం మందిని దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తున్నాయి.
ముఖ్యంగా శ్వాసకోశాలపై కొవిడ్ దుష్ప్రభావం వల్ల కొందరు ఇళ్ల వద్దనే ఉండి ఆక్సిజన్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాణసంచా నుంచి వచ్చే కాలుష్యం వల్ల ఇటువంటి వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. శ్వాసకోశాలపై వైరస్ తీవ్ర దాడికి తెగబడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొగ వచ్చే బాణసంచా వల్లనే ముప్పు ఉంటుందని ఎక్కువమంది అనుకుంటారు. కానీ రంగులు వెదజల్లే బాణసంచాతోనూ రసాయనాలు విడుదలవుతాయి. ఇవి ఊపిరితిత్తులపై దుష్ప్రభావం చూపుతాయి.
వాయు కాలుష్యం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పితో పాటు కొవిడ్ కూడా విజృంభించే అవకాశాలున్నాయి. దీపావళికి ముందుతో పోల్చితే.. బాణసంచా కాల్చిన తర్వాత సూక్ష్మ ధూళికణాలు, అతి సూక్ష్మ ధూళికణాలు అనూహ్యంగా 30 నుంచి 40 రెట్లు అధికంగా పెరుగుతున్నట్లుగా మన దేశంలో ఇప్పటికే గుర్తించారు. గతేడాది హైదరాబాద్‌లో దీపావళి ముందు పీఎం సగటున ఒక క్యూబిక్ మీటరు గాలిలో సుమారు 80-90 మైక్రోగ్రామ్‌లు నమోదు కాగా.. దీపావళి రోజున దాదాపు రెండింతలయ్యాయి.
దేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజే 17వేలు దాటిన కేసులు..
27 Jun 2022 5:17 AM GMTకాకినాడ జిల్లాలో దిశ మార్చుకున్న పులి
27 Jun 2022 4:39 AM GMTAmaravati: లీజుకు అమరావతి భవనాలు..!
27 Jun 2022 3:32 AM GMTకేంద్రంపై వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి ఫైర్
26 Jun 2022 8:14 AM GMTఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలు కళకళ
26 Jun 2022 5:03 AM GMTబీహార్‌కు చెందిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు
26 Jun 2022 3:30 AM GMTతెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు చెప్పాల్సిందే..
25 Jun 2022 10:50 AM GMT
Indian Navy 2022: పదో తరగతి ఐటీఐ చదివారా.. ఇండియన్ నేవీలో 338...
27 Jun 2022 9:00 AM GMTRevanth Reddy: అంబానీ, అదానీ కంపెనీల రక్షణ కోసమే అగ్నిపథ్
27 Jun 2022 8:52 AM GMTMinister KTR: హైదరాబాద్‌కు జుమ్లా జీవులు వస్తున్నారు.. అయితే జుమ్లా...
27 Jun 2022 8:42 AM GMTగజ్వెల్ స్టేషన్ లో గూడ్స్ రైలును ప్రారంభించిన మంత్రులు
27 Jun 2022 8:31 AM GMTLIC Policy: ప్రతిరోజు రూ.100 పొదుపు చేయండి.. మెచ్యూరిటీపై 20 లక్షలు...
27 Jun 2022 8:30 AM GMT