దేశవ్యాప్తంగా 29కి చేరిన స్ట్రెయిన్ వైరస్ కేసులు

దేశవ్యాప్తంగా 29కి చేరిన స్ట్రెయిన్ వైరస్ కేసులు
x
Highlights

* దేశంలో కొత్తగా నలుగురికి స్ట్రెయిన్ నిర్ధారణ * తెలంగాణలో ఇప్పటివరకు 3 స్ట్రెయిన్ కేసులు * స్ట్రెయిన్ కేసుల వివరాలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ

ఇండియాలో కొత్త స్ట్రెయిన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయ్. 29కు చేరింది ఆ నంబర్ ఇప్పుడు ! దీంతో ఏం జరగబోతుందన్న టెన్షన్ మరింతగా కనిపిస్తోంది జనాల్లో ! అసలే న్యూ ఇయర్ వేడుకలు.. ఆ తర్వాత సంక్రాంతి.. ఇలాంటి లెక్కలేసుకొని ఆందోళన చెందుతున్నారు. దేశ వ్యాప్తంగా స్ట్రెయిన్ వైరస్ కరోనా కేసులు 29కి చేరుకున్నాయి. కొత్తగా నలుగురికి స్ట్రెయిన్ నిర్దారణ అయ్యింది. దేశంలోని ఆరు ల్యాబ్ ల్లో యూకే స్ట్రెయిన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు మూడు స్ట్రెయిన్ కేసులు గుర్తించారు. వైరస్ పరీక్షల వివరాలను కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories