CoronaVirus: గాలితోనూ కరోనా వ్యాపి; వెంటిలేషన్‌ లేకుంటే ప్రమాదమే!

CoronaVirus Spred via Air
x

కరోనా కణాలు (ఫొటో ట్విట్టర్)

Highlights

CoronaVirus: గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని యూఎస్ సెంటర్ ఫర్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది.

CoronaVirus: గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని యూఎస్ సెంటర్ ఫర్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వెంటిలేషన్ ఏర్పాటుచేసుకోవడమే మంచి మార్గమని చెప్పింది. ప్రస్తుత తరుణంలో వెంటిలేషన్ లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిందని సూచించింది. ఇంటిలోపల గాలి స్వచ్ఛంగా ఉండాలని, ఇలాఉంటే కరోనా వైరస్ మాత్రమే కాకుండా, ఇతర ఫ్లూలు, శ్వాససంబంధ ఇన్ఫెక్షన్లను కూడా దరిచేరవని పేర్కొంది.

ఇండోర్ లో గాలి వచ్చేందుకు, వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటే అంటువ్యాధులను నివారించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తుమ్మడం, దగ్గడం, మాట్లాడటం వంటివి చేసినప్పుడు కరోనా సోకిన వ్యక్తి ముక్కు, గొంతు నుంచి వైరస్ కణాలు బయటకు వ్యాప్తి చెందుతాయని పేర్కొంది. అందులోని పెద్ద కణాలు వేగంగా కిందకు పడిపోతాయని, చిన్న కణాలు మాత్రం గాల్లో తేలుతూ ఉంటాయని పేర్కొన్నారు.

తేలికపాటి కరోనా కణాలు గాలి వేగం, తేమ, ఉష్ణోగ్రతను బట్టి ప్రయాణం చేస్తాయని తెలిపారు. ఇవి గాల్లో ఎక్కువ సేపు ఉంటాయని, గదుల్లో మరింత వేగంగా కదులుతాయని పేర్కొన్నారు. ఈ కణాలే ప్రజలకు ప్రమాదకరంగా తయారవుతున్నాయని వెల్లడించారు. భవనాలు, ఇళ్లు, గదుల్లో వెంటిలేషన్ ను పెంచుకోవాలని, లేదంటే ప్రమాదాలను కొని తెచ్చుకోవడమేనని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories