తమిళనాడులో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులకు కరోనా పాజిటివ్‌

తమిళనాడులో ముగ్గురు ఐపీఎస్‌ అధికారులకు కరోనా పాజిటివ్‌
x
Highlights

తమిళనాడులో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంది.. కరోనా కట్టడికోసం కృషి చేస్తున్న పోలీస్ సిబ్బంది కూడా ఎక్కువగా కోవిడ్ భారిన పడుతున్నారు.

తమిళనాడులో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంది.. కరోనా కట్టడికోసం కృషి చేస్తున్న పోలీస్ సిబ్బంది కూడా ఎక్కువగా కోవిడ్ భారిన పడుతున్నారు.తాజాగా ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లకు కరోనా సోకింది. దీంతో వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించినట్టు తెలుస్తోంది. కాగా ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు వైరస్‌ బారిన పడడంతో పోలీసు బాధితుల సంఖ్య 190కి చేరుకుంది. ఇదిలావుంటే తమిళనాడులో మొత్తం పాజిటివ్‌ కేసులు 8718 గా ఉన్నాయి.. ఇందులో మంగళవారం నమోదైన కేసులు 716 ఉన్నాయి..

ఇక రాష్ట్రవ్యాప్తంగా 8718 పాజిటివ్ కేసులుంటే.. ఒక్క చెన్నైలోనే మొత్తం 4882 కేసులున్నాయి. చెన్నైలో మంగళవారం నాటికి 4,882, తిరువళ్లూరులో 467, కడలూరులో 396, చెంగల్పట్టులో 391, అరియలూరులో 344, విళుపురం 299 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,134 మంది కోలుకొని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ కాగా.. ఇందులో 83 మంది నిన్న ఒక్కరోజే డిశ్చార్జ్ కావడం విశేషం. ఇక మృతుల సంఖ్య మాత్రం 53 మంది మృతి చెందారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories