నిజాముద్దీన్ లో పాల్గొన్న 303 మందికి కరోనా?

నిజాముద్దీన్ లో పాల్గొన్న 303 మందికి కరోనా?
x
Highlights

ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ లో ప్రార్ధనలు జరిగిన మర్కజ్ భవనానికి వెళ్లిన వాళ్లలో చాలా మంది కరోనా భారిన పడ్డట్టు ప్రాధమిక అంచనాకు వచ్చింది కేంద్ర హోమ్ శాఖ.

ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ లో ప్రార్ధనలు జరిగిన మర్కజ్ భవనానికి వెళ్లిన వాళ్లలో చాలా మంది కరోనా భారిన పడ్డట్టు ప్రాధమిక అంచనాకు వచ్చింది కేంద్ర హోమ్ శాఖ.ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితోపాటు ఆ భవనంలో ఉన్న ఉన్న వారందరికీ వైరస్ సోకినట్లు హోమ్ శాఖ అనుమానిస్తోంది. మర్కజ్ ఘటనపై కేంద్ర హోమ్ శాఖ వివరాలు సేకరించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు విదేశాల నుంచి తబ్లీజ్ జమాత్ కార్యక్రమంలో ముస్లింలు పాల్గొన్నట్టు అధికారులు గుర్తించారు.

అంతేకాదు ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ , నేపాల్ , మయన్మార్, బాంగ్లాదేశ్ , శ్రీలంక , కజకిస్థాన్ నుంచి కూడా వందల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్చి 21 నాటికి ముర్ఖజ్ భవనంలో మొత్తం 1746 మంది ఉన్నట్లు గుర్తించింది. వారిలో 1530 మంది మనదేశానికి చెందిన వారు కాగా 216 మంది విదేశీయులు ఉన్నట్టు గుర్తించారు.

వీరిలో 824 మంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో జిల్లా కోఆర్డినేటర్ల ద్వారా జిల్లా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారని కేంద్ర హోమ్ శాఖ గుర్తించింది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీగానే వెళ్లినట్టు గుర్తించారు. తెలుగు రాష్ట్రాల నుంచి 400 వందల మంది దాకా ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది. ఇందులో హైదరాబాద్ నుంచి 186 మంది, మెదక్ 26 , నల్గొండ 21 , ఖమ్మం 15, ఆదిలాబాద్ 10 , రంగారెడ్డి 15, కరీంనగర్ 17, మహబూబ్ నగర్ 25, భైంసా 11 మందిని ప్రస్తుతానికి గుర్తించారు. ఇక ఆంధ్ర నుంచి ఎక్కువగా వెళ్లారు.

మర్కజ్ భవనంలో మార్చి 26 నుంచి పాల్గొన్న తబ్లీజ్ జమాత్ కార్యకర్తలకు 12 వందల మందిని స్క్రీనింగ్ చెయ్యగా 303 మందికి కరోనా ఉన్నట్లు గుర్తించామని హోమ్ శాఖ అధికారులు తెలిపారు. మిగతా వారిని కూడా స్క్రీనింగ్ చేసి అవసరమైన వారిని క్వారంటైన్ కు తరలిస్తున్నారు. మరోవైపు చాలా మంది వివరాలను ఇవ్వకపోవడంతో గుర్తించడం తలనొప్పిగా మారింది దాంతో రాష్ట్రాల పోలీసుల సహాయాన్ని తీసుకుంటోంది హోమ్ శాఖ.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories