భారత్ లో మరోసారి పెరిగిన కరోనా కేసులు.. నిన్నటినుంచి 11 మరణాలు..

భారత్ లో మరోసారి పెరిగిన కరోనా కేసులు.. నిన్నటినుంచి 11 మరణాలు..
x
Highlights

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఆదివారం తాజాగా 472 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఆదివారం తాజాగా 472 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో భారతదేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కోవిడ్ -19 కేసులు 3,374 గా ఉన్నాయి. అంతేకాదు శనివారం నుంచి 11 మరణాలు సంభవించాయి.

దాంతో మొత్తం మరణాల సంఖ్య 79 కి చేరింది. మరోవైపు దేశవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనావైరస్ పై భారత్ పోరాడుతోంది. దేశం మొత్తం 21 రోజుల లాక్డౌన్ అమల్లో ఉంది. కేవలం అవసరమైన సేవలు మాత్రమే పనిచేస్తున్నాయి.

భారతదేశంలో ఇంకా "కమ్యూనిటీ ట్రాన్స్మిషన్" దశలో లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, రోజూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. మార్చి 10 మరియు 20 మధ్య 10 రోజులలో, భారతదేశంలో కోవిడ్ -19 కు పాజిటివ్ పరీక్షించిన వారి సంఖ్య, 50 నుండి 196 కి పెరిగింది. ఇది మార్చి 25 నాటికి 606 కి చేరుకుంది.. నెలచివరికి (మార్చి 31) భారతదేశంలో 1,397 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.

ఆ తరువాత, ఐదు రోజులలో భారతదేశంలో కోవిడ్ -19 కేసులలో 120 శాతం పెరుగుదల కనిపించింది, ఏప్రిల్ 4 నాటికి భారతదేశంలో మొత్తం 3,072 కేసులు ఉన్నాయి. శనివారం నమోదైన కేసులతో కేసుల సంఖ్య 3,374 కు చేరుకుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories