భారతీయుల కోసం చైనాకు రెండు విమానాలు

భారతీయుల కోసం చైనాకు రెండు విమానాలు
x
Highlights

కరోనా వైరస్ కు కేంద్రంగా ఉన్న చైనా హుబీ ప్రావిన్స్ నుండి భారతీయ పౌరులను తరలించడానికి ప్రభుత్వం రెండు విమానాలను నడపాలని యోచిస్తోంది. వారిని 28...

కరోనా వైరస్ కు కేంద్రంగా ఉన్న చైనా హుబీ ప్రావిన్స్ నుండి భారతీయ పౌరులను తరలించడానికి ప్రభుత్వం రెండు విమానాలను నడపాలని యోచిస్తోంది. వారిని 28 రోజులపాటు ఐసోలేషన్ లో ఉంచుతామని తెలిపారు. హుబీ రాజధాని వుహాన్ నుండి వైరస్ సోకని వ్యక్తులు, లేదా ఫ్లూ లక్షణాలు లేని వారిని మాత్రమే విమానంలోకి అనుమతిస్తామని భారతీయ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. వైరస్ బారిన పడని వ్యక్తులకు తరలింపును సులభతరం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. ఇంకా ఆలస్యం చేస్తే ప్రమాదం పంచి ఉందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

బుధవారం సాయంత్రం, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఈ విషయంపై ట్వీట్ చేశారు అందులో "చైనాలోని హుబీ ప్రావిన్స్ నుండి మన పౌరులను తిరిగి తీసుకురావడానికి రెండు విమానాలు నడపడానికి చైనా ప్రభుత్వం అనుమతి కోరింది.' అని తెలిపారు. ఫ్లూ లక్షణాలు లేని వారిని మాత్రమే విమానంలో ఎక్కించాలనే నిర్ణయంపై, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. వారు చైనాను విడిచిపెట్టి వచ్చే పౌరులతో తాము చర్చించామని ఎటువంటి లక్షణాలు లేవు అని నిర్ధారించుకున్న తరువాతే వారిని ఫ్లైట్ కు అనుమతిస్తామని తెలిపారు. అయితే అక్కడ ఎంతమంది భారతీయులు ఉన్నారో ఇంకా స్పష్టత రాలేదని అన్నారు.

బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం (EOI) బుధవారం స్థానిక సమయం 4 గంటలకు (మధ్యాహ్నం 1.30 గంటలకు IST) వ్రాతపూర్వకంగా ఆ దెస అంగీకారాన్ని తీసుకున్నామని.. బుధవారం ఉదయం పంపిన సందేశంలో, రాయబార కార్యాలయంలోని అధికారులు హుబీ ప్రావిన్స్ నుండి భారతీయ పౌరులను తరలించే తేదీ మరియు లాజిస్టిక్‌లను ఖరారు చేసే పనిలో ఉన్నారని చెప్పారు.

ప్రస్తుతం 500 మంది భారతీయులు ప్రస్తుతం వుహాన్ మరియు హుబీ ప్రావిన్స్‌లో ఉన్నట్టు మన ప్రభుత్వం అంచనా వేస్తోంది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందడంతో రవాణా వ్యవస్థను నిలిపివేయడంతో వీరంతా త్వరగా ఇండియాకు చేరుకోలేకపోయారని అన్నారు.. భారతదేశంలో, ఇప్పటివరకు ఎనిమిది రాష్ట్రాలలో 39 మంది ఐసోలేషన్ ఉన్నారు. వీరిలో 27 మంది ఇప్పటికే ప్రతికూల పరీక్షలు చేశారు.. ఇతరులపై కూడా పరీక్షలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయులు చైనాకు వెళ్లోద్దని ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.

అంతేకాదు భారతదేశం నుండి చైనాకు ఎగురుతున్న విమాలను కొన్నింటిని రద్దు చేశాయి విమానయాన సంస్థలు. సిబ్బందికి ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. భారత బెంగళూరు - హాంకాంగ్ విమానాలను ఫిబ్రవరి 1 నుంచి, ఢిల్లీ చెంగ్డు విమానాలను అదే ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు నిలిపివేయాలని నిర్ణయించినట్లు భారత అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో బుధవారం తెలిపింది. ఢిల్లీ -షాంఘై విమానాలను జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14 వరకు నిలిపివేస్తామని, ఢిల్లీ - హాంకాంగ్ విమానాల ఫ్రీక్వెన్సీని రోజుకు మూడుకి తగ్గిస్తామని ఎయిర్ ఇండియా తెలిపింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories