Coronavirus: ప్రపంచంలోని ప్రతి రెండు కేసుల్లో ఒకటి భారత్‌లోనే..

Coronavirus: ప్రపంచంలోని ప్రతి రెండు కేసుల్లో ఒకటి భారత్‌లోనే..
x

కరోనా(ఫైల్ ఇమేజ్ )


Highlights

Coronavirus: ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల్లో ప్రతి రెండు కేసుల్లో ఒకటి భారత్‌లోనే నమోదవుతున్నాయి.

Coronavirus: ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల్లో ప్రతి రెండు కేసుల్లో ఒకటి భారత్‌లోనే నమోదవుతున్నాయి. మొత్తం కోవిడ్ మరణాల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌ కన్నా ప్రస్తుతం మనదగ్గర రోజువారీ మరణాలు దాదాపు ఒకటిన్నర రెట్లు. భారత్ లో కరోనా ఉధృతి స్థాయిని చాటుతున్న గణాంకాలివి. దేశంలో కరోనా బాధితుల సంఖ్య రెండు కోట్ల దాటింది. వీరిలో 2 లక్షల 20వేల మంది మృతిచెందారు.

భారత్ లో కరోనా బాధితుల సంఖ్య ఏప్రిల్‌ 19న కోటిన్నరకు చేరగా 14 రోజుల్లోనే మరో 50 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 30న దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నాలుగు లక్షలు దాటాయి. తర్వాత రెండు రోజులు మళ్లీ కేసుల సంఖ్య తగ్గింది. మే 1, 2 తేదీలు సెలవుల నేపథ్యంలో పరీక్షలు లక్షపైనే తగ్గాయి. మూడో రోజూ రికవరీలు 3 లక్షలు దాటాయి. యాక్టివ్‌ కేసుల్లో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లక్షకుపైగా ఏడు రాష్ట్రాల్లో 50 వేల నుంచి లక్ష మధ్య ఉన్నాయి. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో యాక్టివ్‌ కేసులు 50 వేల దిగువన ఉన్నాయి.

యూపీలో కరోనా కర్ఫ్యూను మంగళ, బుధవారాలు సైతం కొనసాగించనున్నారు. పుదుచ్చేరిలో లాక్‌డౌన్‌ను ఈనెల 10 వరకు పొడిగించారు. మధ్యప్రదేశ్‌, బెంగాల్‌ ప్రభుత్వాలు జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వర్కర్లుగా గుర్తించాయి. ఢిల్లీలో కొవిడ్‌ ఆస్పత్రుల నిర్వహణ, ఆక్సిజన్‌ సరఫరాలో సంక్షోభాన్ని అధిగమించేందుకు సైన్యం సాయం చేసేలా ఆదేశాలివ్వాలని డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కోరారు. ఇదే విషయమై హైకోర్టులో పిల్‌ దాఖలైంది. దీనిపై స్పందించాలని కేంద్రాన్ని హైకోర్టు కోరింది.

తెలంగాణ, ఢిల్లీ, ఛత్తీస్గఢ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌ తో పాటు 13 రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి. ఏపీ‌, కర్ణాటక, కేరళ, బిహార్‌, రాజస్థాన్‌, సిక్కిం, తమిళనాడు, బెంగాల్‌, త్రిపుర వంటిచోట్ల పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. 15 రోజుల్లో కేసులు తగ్గిన జిల్లాల జాబితాలో తెలంగాణలోని నిర్మల్‌ ఉంది. 14 నైట్రోజన్‌ ప్లాంట్లను ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లుగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్రం తెలిపింది.


Show Full Article
Print Article
Next Story
More Stories