క‌రోనా మృత్యుగీతం.. వెయ్యి మందికిపైగా బ్యాంక్ ఉద్యోగులు బ‌లి

Covid-19 killed over  1200 bank employees in India
x

క‌రోనా వైర‌స్ ప్ర‌తీకాత్మక చిత్రం

Highlights

Coronavirus:క‌రోనా ర‌క్క‌సి దేశ వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తుంది.

Coronavirus: కరోనా ర‌క్క‌సి దేశ వ్యాప్తంగా క‌ల్లోలం సృష్టిస్తుంది. ఈ వైర‌స్ దాటికి ఇప్ప‌టికే అనేక మంది అమాయ‌కులు చ‌నిపోయారు. బ్యాంకింగ్ రంగ ఉద్యోగులు క‌చ్చితంగా బ్యాంకుల‌కు వెళ్లాల్సింన పరిస్థితి. ఇప్పటిదాకా వెయ్యి మందికిపైగా బ్యాంక్ ఉద్యోగులు మరణించారని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ వెల్ల‌డించింది.

బ్యాంక్ ఉద్యోగులూ ఫ్రంట్ లైన్ వర్కర్లేనని, వైరస్ వారినీ కబళిస్తోందని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్. నాగరాజన్ వెల్లడించారు. మహమ్మారి ధాటికి ఇప్పటిదాకా 1,200 మంది దాకా ఉద్యోగులు చనిపోయారని చెప్పారు. బ్యాంకులు కేసులు, మరణాలకు సంబంధించి సరైన సంఖ్య చెప్పట్లేదని, మరింత ఎక్కువ మంది చనిపోయి ఉంటారని అన్నారు.

కాగా, కరోనా ముప్పు ఎక్కువగా బ్యాంకు, బీమా సంస్థల ఉద్యోగులకూ ఉందని, వారికీ వ్యాక్సిన్ వేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రాలకు లేఖ రాశారు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి దేవశీష్ పాండా.

Show Full Article
Print Article
Next Story
More Stories