Coronavirus: దేశంలో మరోసారి భారీగా పెరిగిన కేసులు.. మంగళవారం రాత్రికల్లా చూస్తే..

Coronavirus: దేశంలో మరోసారి భారీగా పెరిగిన కేసులు.. మంగళవారం రాత్రికల్లా చూస్తే..
x
Highlights

దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 47 వేలకు పెరిగింది. ఇప్పటివరకు 14 వేలకు పైగా రోగులు కోలుకొని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారు.

దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య 47 వేలకు పెరిగింది. ఇప్పటివరకు 14 వేలకు పైగా రోగులు కోలుకొని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్ అయ్యారు.మంగళవారం సాయంత్రానికల్లా 2966 నివేదికలు పాజిటివ్ గా తేలాయి ఉన్నాయి, వీటిలో మహారాష్ట్రలో 984, గుజరాత్‌లో 441, పంజాబ్‌లో 219, ఢిల్లీ లో 206, మధ్యప్రదేశ్‌లో 107, ఉత్తర ప్రదేశ్‌లో 114, రాజస్థాన్‌లో 97, తమిళనాడులో 508 ఉన్నాయి. అంతకుముందు సోమవారం, 3900 మంది సోకినవారు ఉన్నారు.

ఈ గణాంకాలు covid19india.org , రాష్ట్ర ప్రభుత్వాల సమాచారం ప్రకారం ఉన్నాయి. అయితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో మొత్తం 46 వేల 711 మంది కరోనా రోగులుండగా.. 31 వేల 967 మందికి చికిత్స జరుగుతోంది. 13 వేల 160 మంది కోలుకున్నారు. 1583 మంది మరణించారు. గత 24 గంటల్లో, గరిష్టంగా 1020 మందికి నయమైంది. దీంతో భారత్ లో రికవరీ రేటు 27.41% గా ఉంది.

ఇదిలావుండగా, లాక్‌డౌన్‌ను మే 29 వరకు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఇది అవసరమని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. అలాగే ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో కూడా లాక్డౌన్ నిషేధాన్ని మే 31 వరకు కొనసాగించాలని సీఎం ఆదేశించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories