భారత్ లో ఆగని కరోనా కేసులు.. గత 24 గంటల్లో..

భారత్ లో ఆగని కరోనా కేసులు.. గత 24 గంటల్లో..
x
Representational Image
Highlights

భారత్ లో కరోనా వైరస్ కేసులు గత 24 గంటల్లో వెయ్యికి పైగా కేసులతో మొత్తం 13,000 మార్కును దాటిన సంగతి తెలిసిందే.

భారత్ లో కరోనా వైరస్ కేసులు గత 24 గంటల్లో వెయ్యికి పైగా కేసులతో మొత్తం 13,000 మార్కును దాటిన సంగతి తెలిసిందే. శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం, భారతదేశంలో మొత్తం కేసుల సంఖ్య 13,885 కు చేరుకుంది. మొత్తం 11,616 క్రియాశీల కేసులను కలిగి ఉండగా, 1,766 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కేసుల్లో 76 మంది విదేశీ పౌరులు ఉన్నారు. శుక్రవారం 23 కి పైగా కోవిడ్ భారిన పడి మరణించడంతో మరణాల సంఖ్య 452 కు చేరుకుంది. శుక్రవారం మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, దేశంలో కోవిడ్ -19 కేసులు ఎక్కువగా మహారాష్ట్ర 3,320, ఢిల్లీ 1,640, తమిళనాడు 1,267. మధ్యప్రదేశ్‌లో కోవిడ్ -19 కేసులు 1,308 కు, రాజస్థాన్‌లో 1,131, గుజరాత్‌లో 1,021, ఉత్తర ప్రదేశ్‌లో 846 కేసులు నమోదయ్యాయి.

ఇక తెలంగాణలో 743, ఆంధ్రప్రదేశ్ 572, కేరళ 395 కేసులు ఉన్నాయి. కరోనావైరస్ కేసుల సంఖ్య కర్ణాటకలో 353, జమ్మూ కాశ్మీర్‌లో 314, పశ్చిమ బెంగాల్‌లో 255, హర్యానాలో 205, పంజాబ్‌లో 186 కేసులకు పెరిగింది. బీహార్‌లో 83 కోవిడ్ -19 కేసులు, ఒడిశాలో 60 కేసులు నమోదయ్యాయి. ఉత్తరాఖండ్‌లో ముప్పై ఏడు మందికి ఈ వైరస్ సోకింది, ఛత్తీస్‌గడ్ లో 36 కేసులు, హిమాచల్ ప్రదేశ్, అస్సాంలో 35 కేసులు నమోదయ్యాయి.

జార్ఖండ్‌లో 29, చండీగర్ 21 , లడఖ్‌ లో 18 కేసులు ఉండగా, అండమాన్, నికోబార్ దీవుల నుంచి 11 కేసులు నమోదయ్యాయి. మేఘాలయలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి, గోవా మరియు పుదుచ్చేరిలో ఏడు అంటువ్యాధులు, మణిపూర్ మరియు త్రిపురాలలో రెండు కేసులు నమోదయ్యాయి, మిజోరాం మరియు అరుణాచల్ ప్రదేశ్లలో ఒక్కొక్క కేసు నమోదైంది.


Show Full Article
Print Article
Next Story
More Stories