భారత్ లో మరోసారి పెరిగిన కోవిడ్ కేసులు.. గురువారం 319..

భారత్ లో మరోసారి పెరిగిన కోవిడ్ కేసులు.. గురువారం 319..
x
Representational Image
Highlights

కరోనావైరస్ సంక్రమణ రోగుల సంఖ్య 6 వేల 245 కు పెరిగింది. గురువారం 319 నివేదికలు పాజిటివ్ అని తేలాయి.

కరోనావైరస్ సంక్రమణ రోగుల సంఖ్య 6 వేల 245 కు పెరిగింది. గురువారం 319 నివేదికలు పాజిటివ్ అని తేలాయి.వీరిలో గుజరాత్‌లో 55, రాజస్థాన్‌లో 30, ఉత్తర ప్రదేశ్‌లో 19, మధ్యప్రదేశ్‌లో 14, బీహార్‌లో 11 మందికి పాజిటివ్ వచ్చింది. ఇవి కాకుండా కర్ణాటకలో 10, జార్ఖండ్‌లో 9, పంజాబ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 5, పశ్చిమ బెంగాల్‌లో 4, ఒడిశాలో 2 కేసులు నమోదయ్యాయి. హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్‌గడ్ లో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి.

ఈ గణాంకాలు covid19india.org వెబ్‌సైట్ ప్రకారం ఉన్నాయి. అదే సమయంలో, దేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య 5 వేల 734 కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ఉదయం తెలిపింది. వీరిలో 472 మంది రోగులు కోలుకోగా, 166 మంది మరణించారని స్పష్టం చేసింది.

ఇదిలావుంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 15 లక్షలకు పైగా నమోదయ్యాయి.. మరణాల సంఖ్య కూడా భారీ ఎత్తున పెరిగింది.. ప్రస్తుతం 89.415 మంది ఈ వ్యాధికి బలయ్యారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా 337.133 మంది కోలుకున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories