భారత్ కరోనా కేసుల సంఖ్య ఇది..

భారత్ కరోనా కేసుల సంఖ్య ఇది..
x
Highlights

భారతదేశంలో గురువారం చివరి నాటికి కరోనావైరస్ కేసుల సంఖ్య 694 కు చేరుకుంది.

భారతదేశంలో గురువారం చివరి నాటికి కరోనావైరస్ కేసుల సంఖ్య 694 కు చేరుకుంది.కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం, దేశంలో క్రియాశీల COVID-19 కేసుల సంఖ్య 633 గా ఉండగా, 44 మందికి నయమైంది. వారంతా ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.. ఇందులో ఒకరు విదేశాలనుంచి వలస వచ్చిన వారిలో ఉన్నారు. కాగా మొత్తం 694 కేసుల్లో 47 మంది విదేశీ పౌరులు ఉన్నారని మంత్రిత్వ శాఖ సమాచారం.

మహారాష్ట్రలో ఇప్పటివరకు అత్యధికంగా 124 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, ఇందులో ముగ్గురు విదేశీ పౌరులు ఉన్నారు, కేరళ ఆ తరువాత స్థానంలో ఉంది. ఎనిమిది మంది విదేశీ పౌరులతో సహా 118 వరకు కేసులు ఉన్నాయని మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కర్ణాటకలో కేసుల సంఖ్య 60కి చేరింది. తెలంగాణలో 10 మంది విదేశీయులతో సహా 44 కి పెరిగింది. గుజరాత్‌లో ఒక విదేశీయుడితో సహా కేసుల సంఖ్య 46 కి చేరుకుంది. పంజాబ్‌లో 34 కేసులు నమోదయ్యాయి, హర్యానాలో 14 మంది విదేశీయులతో సహా 41 కేసులు నమోదయ్యాయి.

లడఖ్‌లో 13 కేసులు ఉండగా, తమిళనాడులో ఆరుగురు విదేశీయులతో సహా 28 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో 11 కేసులు, జమ్మూ కాశ్మీర్‌లో 14 కేసులు నమోదయ్యాయి. చండీగడ్ లో ఆరు కేసులు నమోదయ్యాయి. ఉత్తరాఖండ్‌లో ఒక విదేశీయుడితో సహా ఐదు కేసులు ఉన్నాయి. బీహార్‌లో ఏడు కేసులు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో నాలుగు కేసులు ఉండగా ఒడిశాలో రెండు కేసులు ఉన్నాయి . పుదుచ్చేరి , మిజోరాం , మణిపూర్‌లు ఒక్కొక్కటి కేసు నమోదు చేశాయి. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉన్నప్పటికీ బుధవారం, భారతదేశం 101 కొత్త కరోనావైరస్ కేసులను నమోదు అయ్యాయి. ఇదిలావుంటే కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్‌డౌన్ వల్ల అవసరమైన సేవలు మరియు వస్తువులు కొరత ఉండదని ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చినప్పటికీ, కిరాణా, కూరగాయలు మరియు పాలు కోసం కొన్నిచోట్ల ఇబ్బందులు ఉన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories