భారత్ లో 830 కి చేరిన కరోనా కేసుల సంఖ్య.. లాక్ డౌన్ నుంచి వీరికి మినహాయింపు

భారత్ లో 830 కి చేరిన కరోనా కేసుల సంఖ్య.. లాక్ డౌన్ నుంచి వీరికి మినహాయింపు
x
Highlights

కరోనా వైరస్ (కోవిడ్ -19) వ్యాప్తి భారత్ లో రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం భారతదేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 830 కు చేరుకుంది, మరణాల సంఖ్య 20 కి పెరిగింది.

కరోనా వైరస్ (కోవిడ్ -19) వ్యాప్తి భారత్ లో రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం భారతదేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 830 కు చేరుకుంది, మరణాల సంఖ్య 20 కి పెరిగింది.భారతదేశం అంతటా దాదాపు 100 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో 39 కేసులు కేరళలో ఉండగా, 28 మహారాష్ట్రలో ఇందులో 15 సంగ్లీ జిల్లాలోనే ఉన్నాయి, ఇక 10 కేసులు తెలంగాణలో, 7 కేసులు ఉత్తరప్రదేశ్ లో, రెండు కేసులు ఏపీలో ఉన్నాయి. శుక్రవారం ఉదయం నాటికి మొత్తం కేసుల సంఖ్య 724 గా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఒక్కరోజే దేశవ్యాప్తంగా 100 కు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులలో 67 మందికి నయం అయింది.. ఇందులో కొంతమంది డిశ్చార్జ్ కూడా అయ్యారు. ఇక కేరళలో అయితే ఒకేరోజు 39 కేసులు నమోదు కావడం ఆ రాష్ట్ర ప్రజల్ని మరింతగా భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే భారత్ లో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రంగా కేరళ ఉంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిపై కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయం సమీక్ష నిర్వహించారు.

ఇదిలావుంటే కొనసాగుతోన్న లాక్‌డౌన్‌ నుంచి కొన్నింటికి మినహాయింపును ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను శుక్రవారం విడుదల చేసింది. ఇందులో వ్యవసాయ కూలీలు, హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్లను నడిపించే మార్కెట్‌ కమిటీ, ప్యాకేజింగ్‌ యూనిట్లు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. వీరు తమ పనులకు వెళ్లొచ్చని.. అయితే సామాజిక దూరం పాటించాలని సూచించింది.

అలాగే అత్యవసర సరుకులు, మందులను రవాణా చేసే ఈ కామర్స్‌ సంస్థలకు కూడా మినహాయింపు ఉంది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన మార్కెట్‌ కమిటీలు నిర్వహించే మండీలు, కనీస మద్దతు ధరకు సంబంధించిన వ్యవహారాలకు కూడా మినహాయింపు లభించింది. వ్యవసాయ సంబంధిత యంత్రాలు, వాటి తయారీ, ఎరువులు పురుగు మందుల తయారీ, ప్యాకేజింగ్‌ యూనిట్లు కూడా లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు జాబితాలో ఉన్నాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories