Coronavirus: భారత్‌లో కరోనాతో మరొకరు మృతి

Arun Chilukuri
Updated on: 17 March 2020 3:30 PM IST
Coronavirus: భారత్‌లో కరోనాతో మరొకరు మృతి
X
Representational Image

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. దీని బారిన పడి ఇప్పటికే భారత్‌లో ఇద్దరు మృతి చెందగా, తాజాగా మహారాష్ట్రకు చెందిన 64 ఏళ్ల వ్యక్తి మృతిచెందాడు. దీంతో కరోనా మృతుల సంఖ్య మూడుకు చేరింది. మహారాష్ట్ర ముంబయిలో 64 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్యులు నిర్ధారించారు. కరోనా లక్షణాలతో ఈ వృద్ధుడు కస్తూర్బా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు ఇవాళ ఒక్కరోజే దేశంలో 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా భాదితుల సంఖ్య 128కు చేరింది. ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కాగా ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే కర్ణాటకలో ఓ వృద్ధుడు, ఢిల్లీలో ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story