Corona Virus: ఒక్కరోజే రికార్డు స్థాయిలో కేసులు

Corona Virus: దేశంలో క‌రోనా కేసుల విజృంభ‌ణ కొన‌సాగుతోంది.

Samba Siva Rao
Updated on: 11 April 2021 4:58 PM IST
Corona Virus Recorded In India
X

కరోనా వైరస్ ప్రతీకాత్మక చిత్రం

Corona Virus: దేశంలో క‌రోనా కేసుల విజృంభ‌ణ కొన‌సాగుతోంది. మొన్న ఒక్క రోజులో 1,45,384 మందికి కరోనా సోక‌గా, నిన్న కొత్త‌గా 1,52,879 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... నిన్న‌ 90,584 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,33,58,805 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 839 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,69,275కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,20,81,443 మంది కోలుకున్నారు. 11,08,087 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 10,15,95,147 మందికి వ్యాక్సిన్లు వేశారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story