Corona Vaccine: కరోనా టీకా మొదటి డోస్ తీసుకున్న ప్రధాని మోడీ

Corona Vaccine: కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న ప్రధాని

K V D Varma
Published on: 1 March 2021 10:08 AM IST
PM Modi taken Covid vaccine
X

కరోనా టీకా తీసుకుంటున్న ప్రధాని మోడీ (మోడీ ట్విట్టర్ ఫోటో)

ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. ఈరోజు ఉదయం ఢిల్లీ లోనే ఎయిమ్స్ ఆసుపత్రిలో కివాగ్జిన్ తొలి టీకాను ప్రధాని వేయించుకున్నారు. కోవిద్ వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం ఆయన కరోనా కట్టడి విషయంలో పోరాడుతున్న వైద్యులు, శాస్త్రవేత్తలు అందరినీ అభినందించారు.

కరోనా టీకా తీసుకున్న తరువాత ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అయన కరోనా వ్యాక్సిన్ తీసుకుంటున్నప్పటి ఫోటోను షేర్ చేశారు.

'ఎయిమ్స్‌లో కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నాను. ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి మన వైద్యులు, శాస్త్రవేత్తలు చేసిన కృషి చెప్పుకోదగినది. టీకా తీసుకోవడానికి అర్హత ఉన్నవారందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. మనమంతా కలిసి కరోనా రహిత దేశాన్ని నిర్మిద్దాం' అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.


K V D Varma

K V D Varma

Next Story