Corona Update: దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

Corona Update: దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి తిరిగి పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది

Kranthi
Published on: 12 March 2021 5:49 PM IST
Corona Update: Corona cases on the rise again in the country
X

ఫైల్ ఇమేజ్


Corona Update: దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి తిరిగి పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. దీంతో ఇప్పటికే నాగ్‌పూర్‌లో లాక్ డౌన్ విధించగా.. తాజాగా అకోలా, ఫర్భని జిల్లాల్లో మూడు రోజులపాటు లాక్‌డౌన్ విధించింది మహారాష్ట్ర సర్కార్. అటు పూణేలోనూ ప్రస్తుతం ఆంక్షలు కొనసాగుతున్నాయి. పుణేలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతోంది. రాత్రి 10 గంటల తర్వాత హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేయాలని ఇప్పిటికే ఆదేశాలు జారీ చేశారు. మహాలో పెరుగుతున్న కేసులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది.

గత నెల రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నాగ్‌పూర్‌లో మార్చి 15 నుంచి 21 వరకు లాక్‌డౌన్విధిస్తున్నట్టు నిన్న సాయంత్రం అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మహారాష్ట్రలోనే కొత్తకేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. గురువారం ఒక్క రోజే 14వేలకు పైగా పాజిటివ్‌ కేసులు రావడం కలకలం రేపుతోంది. మహారాష్ట్రలో లక్షకు పైగా యాక్టివ్‌ కేసులు ఉండటంతో కేంద్రం ఆందోళన వ్యక్తంచేసిన విషయం తెలిసిందే.

Kranthi

Kranthi

Next Story