Corona Effect: ఒక్కరితోనే బెంగళూరు - చెన్నై విమానం

Corona Effect on Flight Services
x

విమాన సర్వీసులు పాత చిత్రం

Highlights

Corona Effect: ప్రయాణీకులు లేక వెలవెలబోతున్న విమానాలు

Corona Effect: కరోనా ఎఫెక్ట్ ప్లైట్స్ పై పడింది. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభించడంతో దేశవ్యాప్తంగా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశీయ సర్వీసుల్లో ప్రయాణించే వారి సంఖ్య బాగా తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల మధ్య తిరిగే డోమెస్టిక్ ప్లైట్స్ ఖాళీ దర్శమిస్తు్న్నాయి. కోవిడ్ ఎఫెక్ట్ కు చాలా సర్వీసులను రద్దు చేశారు. కొన్ని సర్వీసులు తిరిగుతున్నా.. అందులోనే సింగిల్ డిజిట్స్ లోనే ప్రయాణికులు ఉంటున్నారు. దీంతో కరోనా రెండోదశ విజృంభణతో విమానయాన రంగం కుదేలవుతోంది.

గత ఏడాది లాక్‌డౌన్‌ తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న విమానయాన రంగం మళ్లీ నష్టాల బాటలో పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి ప్లైట్స్ ఎక్కేవారి సంఖ్య క్రమంగా తగ్గింది. ప్రయాణికులు లేకపోవడంతో మార్చి నుంచి డోమెస్టిక్ సర్వీసులను తగ్గిస్తు్న్నాయి విమానయాన సంస్థలు. గత నెలరోజుల్లో కోవిడ్‌ కేసులు పెరగడంతో ప్లైట్స్ లో ప్రయాణించేవారి సంఖ్య 30శాతానికి తగ్గిపోయింది.

మార్చి మొదటి వారంలో దేశీయ విమాన సర్వీసుల్లో.. సుమారు 3లక్షల 13వేల మంది ప్రయాణించగా.. ఏప్రిల్‌ రెండోవారానికి ఈ సంఖ్య 2లక్షల 36వేలకు పడిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే, చాలా విమానాలను ఖాళీగా నడపాల్సి వస్తుందని విమానయాన సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా రోజు చెన్నై నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ప్రదాన నగరాలకు పలు విమాన సర్వీసుల రాకపోకలు కొనసాగుతుంటాయి. అయితే, గత రెండు వారాల్లో ప్రయాణీకుల సంఖ్య భారీగా తగ్గడంతో.. చెన్నైకి రావాల్సిన 18 విమానాలు రద్దయ్యాయి.

కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంటర్ నేషనల్ ప్లైట్స్ కన్నా.. డోమెస్టిక్ సర్వీసులపైనే ఎక్కువగా పడింది. గత కొద్దిరోజుల నుంచి విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య బాగా తగ్గుతోంది. ఈనెల 13న బెంగళూరు నుంచి చెన్నై వచ్చిన ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో ఒకే ఒక్కరు ప్రయాణించారు. మరో విమానంలో అయితే, కేవలం 8మంది కనిపించారు. రాయపూర్‌ నుంచి చెన్నై వచ్చిన విమానంలో ముగ్గురు, మంగళూరు, కోయంబత్తూర్‌ నుంచి వచ్చిన విమానాల్లో అయితే ఐదుగురు మాత్రమే జర్నీ చేశారు. కోజికోడ్‌ నుంచి వచ్చిన విమానంలో ఏడుగురు, హైదరాబాద్‌ నుంచి చెన్నై వచ్చిన విమానంలో 8మంది, మైసూరు నుంచి వచ్చిన విమానంలో9మందే ఉన్నారు. ప్రయాణికుల్లేక, ముంబై వెళ్లాల్సిన 3 ప్లైట్లు.. చెన్నై నుంచి హైదరాబాద్‌ వెళ్లాల్సిన మూడు విమానాలు, బెంగుళూరు, మధురై, పాట్నా వెళ్లాల్సిన ఒక్కో విమానం రద్దయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories