దేశంలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్

Corona Cases In India: ఒక్కరోజు 17 వేల 135 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది

Jyothi
Updated on: 5 Aug 2022 7:20 AM IST
Corona Danger Bells Again in the Country
X

దేశంలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్

Corona Cases In India: దేశంలో కరోనా వైరస్ మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా మరోమారు బుసలు కొడుతోంది. తాజాగా రికార్డు స్థాయిలో పాజిటివిటీ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 19 వేల 893 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్కరోజు 17 వేల 135 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4 కోట్ల 40 లక్షల 87 వేల 37కు చేరింది.

వీరిలో 4 కోట్ల 34 లక్షల 24 వేల 29 మంది కోలుకున్నారు. అయితే గత 24 గంటల్లో కరోనా వైరస్ బారినపడి 53 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. రోజువారి పాజిటివిటీ రేటు 4.3 శాతానికి చేరింది. రికవరీ రేటు 98.50 శాతంగా ఉంది. మరోవైపు కరోనా వైరస్‌‌కు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 205 కోట్లకు పైగా కరోనా వైరస్ వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.

Jyothi

Jyothi

Next Story