Kerala: కేరళలో కరోనా ఉగ్రరూపం

Kerala: కేరళలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 29 Aug 2021 2:17 PM IST
Corona Cases Increasing in Kerala
X

Kerala: కేరళలో కరోనా ఉగ్రరూపం

Kerala: కేరళలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో దాదాపు సగానికి పైగా కేసులు ఇక్కడే వెలుగుచూస్తున్నాయి. ఓవైపు కట్టడి చర్యలు తీసుకుంటున్నా వ్యాక్సినేషన్ జరుగుతున్నా వైరస్ ఉధృతి మాత్రం ఆగడం లేదు. దీంతో మరింత అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం రాత్రి పూట కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆగస్టు 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తామని సీఎం ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 18.67 శాతంగా ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story