Corona: దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా

Corona: దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా
x

కరోనా (ఫైల్ ఇమేజ్)

Highlights

Corona: వరుసగా మూడు రోజులుగా రెండు లక్షలు దాటిన కేసులు

Corona: కంటికి కనిపించదు. కాస్తైనా కరుణించదు. ఎటాక్‌ చేయడమే దానికి తెలిసిన విద్యా. ఎందరో ఉసురుతీసింది. మరెందరినో ఆసుపత్రి పాలు చేసింది. ఎన్నో కుటుంబాలకు కన్నీళ్లను మిగిల్చింది. మనిషే దాని లక్ష్యం. ఆ మనిషే దానికి అస్త్రం. అందర్ని టచ్‌ చేసే వెళ్తానంటూ మారం చేస్తోంది ఈ మాయదారి కరోనా.. గతవారం రోజుల్లో దేశంలో నమోదైన కేసులు భవిష్యత్‌పై భయాన్ని పుట్టిస్తున్నాయి. కరోనా కట్టడిలో ప్రపంచ ప్రశంసలు అందుకున్న ఇండియాకు ఇప్పుడు ఏమైంది. కరోనాకు ఎందుకు దాసోహం అంటోంది. ఎక్కడ తేడా కొడుతుంది.

గతేడాది హర్రర్‌ ఫిల్మ్‌ చూపించిన కరోనా కాస్త బ్రేక్‌ ఇచ్చి ఇప్పడు కాటేసే కాలనాగులా విషం చిమ్ముతుంది. గడప దాటితే చాలు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎటాక్‌ చేస్తుందో అని జనం జంకుతున్నారు. సామాన్యుల గుండెల్లో కరోనా గుబులురేపుతోంది. రెక్కాడితేనే డొక్కాడని జీవితాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వాళ్లు పనికో, ఉద్యోగానికో వెళ్లక తప్పడంలేదు. అక్కడేమో కరోనా కోరలు చాచి కన్నెర్రచేస్తోంది. ఇంట్లో ఉండలేక బయటకురాలేక సామాన్యులు చస్తూ బతుకుతున్నారు.

మనుషుల ప్రాణాలు గాల్లో దీపాలయ్యాయి. నిన్న ఒక్కరోజే 13వందల మందికి పైగా వైరస్‌కు బలయ్యారు. గత మూడు రోజులుగా రెండు లక్షలకు మించి కరోనా కేసులు నమోదవుతున్నాయి. అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాల్లో కరోనా కేసులు కంట్రోల్‌లో అవుతుంటే ఇండియాలో మాత్రం సెకండ్వేవ్ సునామీలా విరుచుకుపడుతోంది. గాలి ద్వారానే వైరస్ వ్యాపిస్తుండడంతో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

మరోవైపు పరిస్థితి చేయి దాటిపోయిందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు జారీ చేస్తోంది. వారం గడిస్తే.. కేసులు రెట్టింపు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా కరోనా జెట్‌ స్పీడ్‌తో దూసుకువస్తుందని హెచ్చరిస్తోంది. దేశాలు మరింత అప్రమత్తంగా ఉండాలని అవసరముందని చెబుతోంది.

జనాలకు కరోనా భయం ఓ రేంజ్‌లో వెంటాడుతుంది. కానీ అంతకుమించి నిర్లక్ష్యపు నీడలో కునుకు తీస్తున్నారు. కరోనా రూల్స్ పాటించాలంటూ వైద్యులు నెత్తినోరు మొత్తుకున్నా. జనాలు తమ లైఫ్‌ స్టైల్ మార్చుకోవడం లేదు. పార్టీలు, ఫంక్షన్లు అంటూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. సిచ్యువేషన్‌ను అర్థం చేసుకున్న చదువుకున్నవాళ్లు సైతం కరోనా నిబంధనలను పాతర వేస్తున్నారు. ఇప్పటికైనా ఒళ్లు దగ్గరుంచుకొని నడుచుకుంటేనే బతికిబట్టకడతాం లేదంటే అంతే సంగతీ.

Show Full Article
Print Article
Next Story
More Stories