దేశంలో మళ్లీ కరోనా విజృంభణ

Corona Cases In India: తాజాగా 20,409 పాజిటీవ్ కేసులు

Sriveni Erugu
Updated on: 29 July 2022 10:50 AM IST
Corona Boom Again in The Country
X

దేశంలో మళ్లీ కరోనా విజృంభణ

Corona Cases In India: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా 3లక్షల 98వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 20వేల 409 మందికి కోవిడ్ సోకింది. పాజిటివిటీ రేటు 5శాతం పైగానే నమోదు అయింది. ఇప్పటి వరకు భారత్‌లో 4కోట్ల 39లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా 4కోట్ల 33లక్షల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 22వేల మంది కోలుకున్నారు. తాజాగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి. యాక్టివ్ కేసులు 1 లక్ష 43వేల 988కి తగ్గాయి. మరో 47 మంది కోవిడ్‌తో మృత్యువాత పడ్డారు. గురువారం 38లక్షల 6వేల మంది టీకా తీసుకోగా మొత్తం 203 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story