వినియోగదారులు అలర్ట్‌.. గ్యాస్‌ సిలిండర్ వివరాలు తనిఖీ చేస్తున్నారా..!

Consumers are Alert Checking LPG Gas Cylinder Details
x

వినియోగదారులు అలర్ట్‌.. గ్యాస్‌ సిలిండర్ వివరాలు తనిఖీ చేస్తున్నారా..!

Highlights

LPG Gas Cylinder: కొన్నిసార్లు ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు పేలిన సంఘటనలు మీరు వినే ఉంటారు.

LPG Gas Cylinder: కొన్నిసార్లు ఇళ్లలో గ్యాస్ సిలిండర్లు పేలిన సంఘటనలు మీరు వినే ఉంటారు. దీనికి కారణం గ్యాస్‌ లీక్‌, షార్ట్‌ సర్క్యూట్‌లు. ఇవి కాకుండా మరో కారణం కూడా ఉంది. గ్యాస్‌ సిలిండర్‌ వివరాలు తనిఖీ చేయకపోవడం. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి కారణమవుతుంది. అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వంట గదిలో మంటలు చెలరేగడానికి ఎల్‌పీజీ సిలిండర్‌ గడువు ముగియడమే ప్రధాన కారణం. అన్నిటిలాగే LPG సిలిండర్‌కు కూడా నిర్ణీత గడువు తేదీ ఉంటుంది. ఈ కాలం గడిచిన తర్వాత సిలిండర్లు పాతవి అవుతాయి. గ్యాస్ ఒత్తిడిని భరించలేవు. ఇది వేడి లేదా అగ్ని సమీపంలో ఉన్నప్పుడు చాలా సార్లు పేలుతాయి.

మీ కుటుంబంలో ఈ రకమైన సమస్య ఉండకూడదనుకుంటే కంపెనీ నుంచి LPG సిలిండర్ తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా గడువు తేదీని తనిఖీ చేయాలి. ఈ తేదీ సిలిండర్ పైభాగంలో రాసి ఉంటుంది. మీరు అక్కడ జాగ్రత్తగా గమనిస్తే మీకు A, B, C లేదా D అక్షరాలు కనిపిస్తాయి. అలాగే అ అక్షరాల ముందు 22, 23, 24 లాంటి నెంబర్లు రాసి ఉంటాయి. ప్రతి సంవత్సరానికి 12నెలలు ఉంటాయని మీకు తెలుసు.

ఈ పరిస్థితిలో ఇంగ్లీష్ నాలుగు అక్షరాలు 3 నెలలను సూచిస్తాయి. ఉదాహరణకు A అక్షరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలని సూచిస్తుంది. B అక్షరం ఏప్రిల్, మే, జూన్ నెలలకు, C అక్షరం జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌, D అక్షరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లని సూచిస్తుంది. ఈ అక్షరాలను అనుసరించే సంఖ్యలు సంవత్సరాన్ని సూచిస్తాయి.ఉదాహరణకు మీ సిలిండర్‌పై B.24అని రాసి ఉంటే మీ సిలిండర్ గడువు జూన్ 2024 అని అర్థం. మరోవైపు అది C.26 అయితే మీ సిలిండర్ సెప్టెంబర్ 2026 వరకు పని చేయగలదని అర్థం. ఆ తర్వాత దీనిని భర్తీ చేయాలి. లేదంటే పేలే ప్రమాదం ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories