కాశ్మీర్‌ టూ కన్యాకుమారి.. అక్టోబర్‌ 2 నుంచి 'భారత్‌ జోడో యాత్ర'..

Congress Bharat Jodo Yatra: భార‌త్ జోడో యాత్ర పేరుతో క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ దాకా పాద‌యాత్ర చేప‌ట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించారు.

Arun Chilukuri
Updated on: 15 May 2022 9:30 PM IST
Congress Will Launch Bharat Jodo Yatra From Oct 2
X

కాశ్మీర్‌ టూ కన్యాకుమారి.. అక్టోబర్‌ 2 నుంచి ‘భారత్‌ జోడో యాత్ర’..

Congress Bharat Jodo Yatra: భార‌త్ జోడో యాత్ర పేరుతో క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ దాకా పాద‌యాత్ర చేప‌ట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించారు. రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్ వేదిక‌గా మూడు రోజులుగా సాగుతున్న న‌వ సంక‌ల్ప్ చింత‌న్ శిబిర్ స‌ద‌స్సులో ఆమె ముగింపు ఉప‌న్యాసం చేశారు. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2 నుంచి ఈ యాత్రను చేప‌ట్టనున్నట్లు నేతల హర్షధ్వానాల మధ్య సోనియా తెలిపారు. ఈ యాత్రలో పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌ల‌తో పాటు జూనియ‌ర్ నేత‌లు అంతా పాలుపంచుకుంటార‌ని సోనియా రోడ్ మ్యాప్ ప్రకటించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి బ‌లోపేతం అవుతుంద‌ని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ బ‌లోపేతానికి చింత‌న్ శిబిర్ ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story