ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల

Congress: ఏఐసీసీ కార్యాలయంలో మేనిఫెస్టో రిలీజ్

Jyothi
Updated on: 5 April 2024 9:40 AM IST
Congress Manifesto Release today
X

ఇవాళ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల 

Congress: లోక్ సభ ఎన్నికలకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు. పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారెంటీస్ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను హస్తం పార్టీ నేతలు విడుదల చేయనున్నారు. సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. న్యాయ్ పిల్లర్ల పేరుతో 25 గ్యారెంటీలను ఐదు విభాగాలుగా విభజించింది.

పీపుల్స్ మేనిఫెస్టో పేరుతో కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళిక రూపకల్పన కోసం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఆధ్వర్యంలోని పార్టీ కమిటీ ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించింది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, పేదల ఆదాయానికి భరోసా, మహిళల హక్కులు, రైతులను దృష్టిలో ఉంచుకొని ఈ డాక్యుమెంట్ రూపొందించారు.

Jyothi

Jyothi

Next Story