ఐ‌శ్వర్య ఆత్మహత్య : సంతాపం తెలిపిన రాహుల్‌ గాంధీ!

ఐ‌శ్వర్య ఆత్మహత్య : సంతాపం తెలిపిన రాహుల్‌ గాంధీ!
x
Highlights

తన చదవు తండ్రికి భారం కాకూడదని తన జీవితాన్నే ముగించుకోవాలన్న నిర్ణయానికి వచ్చి ఆత్మహత్య చేసుకుంది.. ఈ సంఘటన చాలా మందిని కదిలించిది..

లాక్ డాన్ కారణంగా హస్టల్‌ యాజమాన్యం బలవంతంగా ఖాళీ చేయాలనీ కోరడంతో మనస్తాపానికి గురైన డీగ్రీ విద్యార్ధిని ఐశ్వర్య రెడ్డి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. తన చదవు తండ్రికి భారం కాకూడదని తన జీవితాన్నే ముగించుకోవాలన్న నిర్ణయానికి వచ్చి ఆత్మహత్య చేసుకుంది.. ఈ సంఘటన చాలా మందిని కదిలించిది.. అయితే తాజాగా ఈ ఘటన పైన కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.. "ఈ విచారకరమైన క్షణంలో విద్యార్థి ఐశ్వర్య కుటుంబ సభ్యులకు నా సంతాపం తెలియజేస్తున్నాను. బీజేపీ అనాలోచితంగా చేసిన నోట్ల రద్దు, లాక్‌డౌన్‌ దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలను నాశనం చేసింది. ఇది నిజం" అని రాహుల్ ట్వీట్ చేశారు..

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌కు చెందిన ఐశ్వర్య రెడ్డి ఇంటర్మీడియట్‌లో రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించింది. పై చదువుల కోసం ఢిల్లీకి వెళ్లింది. అక్కడి శ్రీరామ డిగ్రీ కాలేజ్‌లో చదువుతూ.. ఐఏఎస్ కోచింగ్‌ తీసుకుంది. అయితే కరోనా కారణంగా తను ఉంటున్న హాస్టల్‌ యజమానులు ఇంటికి పంపించారు. కొవిడ్ కారణంగా హాస్టల్ ఖర్చులు అధికంగా అవటంతో ఆందోళన చెందిన ఐశ్వర్య రెడ్డి.. కుటుంబానికి తన చదువు భారం కాకుడదని ఆత్మహత్యకు పాల్పడింది.

ఈనెల 3న ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన ఐశ్వర్య.. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌ రాసింది. తమ ఇంటి మహాలక్ష్మి.. అర్ధాంతరంగా తనువు చాలించటంతో ఆ కుటుంబం శోకసంద్రలో మునిగిపోయింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవటం పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రేకెత్తుతున్నాయి. విద్యార్థి సంఘాలు ప్రభుత్వ వైఫల్యం వల్లే ఐశ్వర్య చనిపోయిందంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఇంటి ముట్టడికి ప్రయత్నించాయి విద్యార్థి సంఘాలు.



Show Full Article
Print Article
Next Story
More Stories