Rahul Gandhi comments on Modi Government : మోడీ ప్రభుత్వం పై రాహుల్ సెటైర్లు!

Rahul Gandhi comments on Modi Government : దేశ ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ పైన గత కొద్ది రోజులుగా విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ.

Krishna
Published on: 21 July 2020 7:39 PM IST
Rahul Gandhi comments on Modi Government : మోడీ ప్రభుత్వం పై రాహుల్ సెటైర్లు!
X
Rahul Gandhi (File Photo)

Rahul Gandhi comments on Modi Government: దేశ ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ పైన గత కొద్ది రోజులుగా విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ. తాజాగా అయన రాజస్థాన్ రాజకీయ సంక్షోభం పైన స్పందిస్తూ.. కరోనా విజృంభిస్తున్న సమయంలో మోడీ సాధించిన విజయాలు ఇవే అంటూ ఎద్దావా చేశారు. దేశంలో కరోనా కట్టడి చేసే పని కాకుండా ప్రభుత్వం ఇతర కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా కాలక్షేపం చేసుకుంటూ వస్తుందని విమర్శించారు. తాజాగా మోడీ హయంలో జరిగిన కొన్ని సంఘటనలను ఉదహరిస్తూ కామెంట్స్ చేశారు రాహుల్..

ఫిబ్రవరి: నమస్తే ట్రంప్‌

మార్చి: మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కూల్చివేసింది

ఏప్రిల్‌: కరోనాపై పోరుకు కొవ్వొత్తులను వెలిగించడం

మే: ప్రభుత్వ ఆరవ వార్షికోత్సవం

జూన్‌: బిహార్లో వర్చువల్‌ ర్యాలీ

జులై: రాజస్థాన్ ప్రభుత్వాన్ని ఉపసంహరించుకునే ప్రయత్నం



కరోనా వైరస్‌పై పోరాటంలో 'స్వయం సమృద్ధి (ఆత్మ నిర్భర్) సాధించిందని రాహుల్‌ ఎద్దేవా చేశారు. అయితే రాహుల్ చేసిన ఈ వాఖ్యలకు నెటిజన్ల నుంచి ఎక్కువగా కౌంటర్లు వస్తున్నాయి. ఇక రాహుల్ చేసిన ఈ వాఖ్యాల పైన బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ స్పందించారు. గత ఆరు నేలలుగా రాహుల్ గాంధీ సాధించిన విజయాలు ఇవే అంటూ అయన ఓ జాబితాను విడుదల చేశారు.

జాబితా ఇలా ఉంది:

ఫిబ్రవరి: షాహీన్ బాగ్ & అల్లర్లు

మార్చి: [జ్యోతిరాదిత్య] సింధియా, ఎంపి ప్రభుత్వాన్ని కోల్పోవడం

ఏప్రిల్: కార్మికులను ప్రేరేపించడం

మే: చారిత్రాత్మక పోల్ ఓటమి 6 వ వార్షికోత్సవం [కాంగ్రెస్]

జూన్: చైనా తరఫు న్యాయవాది

జూలై: రాజస్థాన్‌లో పార్టీ [కాంగ్రెస్] నాశనం



Krishna

Krishna

Next Story