జల్లికట్టు వేడుకలను వీక్షించనున్న రాహుల్ గాంధీ

X
Highlights
తమిళనాడులో ఈసారి సంక్రాంతి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నడూ లేని విధంగా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఏక...
Arun Chilukuri14 Jan 2021 7:54 AM GMT
తమిళనాడులో ఈసారి సంక్రాంతి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నడూ లేని విధంగా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఏకంగా జాతీయ పార్టీ నేతలు క్యూ కట్టారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఇప్పటి నుంచే తమిళ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఏ చోటా, మోటా లీడర్లో కాదు నేరుగా అధ్యక్ష స్థాయి నేతలే రంగంలోకి దిగారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, RSS చీఫ్ మోహన్ భగవత్ మరికొందరు ప్రముఖులు చెన్నై ఫ్లైటెక్కారు. రాహుల్ గాంధీ మధురై జిల్లా అవన్యపురం వెళ్లి జల్లికట్టు వేడుకలను వీక్షిస్తారు. రాహుల్ గాంధీని స్వాగతించేందుకు కాంగ్రెస్‌తో పాటు డీఎంకే నేతలు రెడీ అయ్యారు. మొత్తంగా తమిళనాట ఈ సంక్రాంతి స్పెషల్ షోగా మారింది.
Web TitleCongress leader Rahul Gandhi attended the Jallikattu event in Madurai district
Next Story