Kapil Sibal: పంజాబ్ పరిణామాలకు నాయకత్వ లోపమే కారణం

* పార్టీలో అధ్యక్షుడు లేకపోవడమే సమస్యలకు కారణం * రాష్ట్ర పరిణామాలు విధ్వంసకర శక్తులకు ఊతం

Sandeep Reddy
Published on: 29 Sept 2021 6:26 PM IST
Congress Leader Kapil Sibal Says Lack of Leadership is the Reason for the Punjab Developments
X

 కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ (ఫైల్ ఫోటో) 

Kapil Sibal: పంజాబ్ పరిణామాలకు కాంగ్రెస్ లో నాయకత్వ లోపమే కారణమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం అధ్యక్షుడు లేడని పార్టీలో ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియడం లేదని అన్నారు. పంజాబ్ రాష్ట్రం సరిహద్దుల్లో ఉందని రాష్ట్రంలో పరిణామాలు పాకిస్థాన్ కు, ఐఎస్ఐకు ప్రయోజనం చేకూరేలా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీకి శాశ్వత జాతీయ అధ్యక్షుడి ఎంపిక చేయాలని లేఖ రాసినా ఇంత వరకూ నిర్ణయం తీసుకోలేదన్నారు. సాధ్యమైనంత త్వరగా సీడబ్ల్యుసి, కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకోవాలన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story