Sonia Gandhi Admitted In Hospital : ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ!

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. గురువారం సాయంత్రం ఆమె న్యూఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ హాస్పిటల్‌లో చేరారు.

Krishna
Published on: 30 July 2020 10:02 PM IST
Sonia Gandhi Admitted In Hospital : ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ!
X
sonia Gandhi (File Photo)

Sonia Gandhi Admitted In Hospital : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. గురువారం సాయంత్రం ఆమె న్యూఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ హాస్పిటల్‌లో చేరారు. అయితే సాధారణ చికిత్స కోసమే ఆమె ఆస్పత్రిలో చేరినట్టు ఆ హాస్పిటల్‌ చైర్మన్‌ డీఎస్‌ రానా వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అంతకుముందు ఫిబ్రవరిలో ఆమె కడుపు నొప్పి బాధతో ఇదే ఆసుపత్రిలో చేర్చారు. ఇక 73 సంవత్సరాల సోనియాగాంధీ గతంలో అనారోగ్యానికి గురై విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకున్న విషయం తెలిసిందే.

ఇక ఈరోజు ఉదయం సోనియా గాంధీ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులతో వర్చువల్‌ మీటింగ్‌లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ మీటింగ్ లో ఆమె ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిణామాలపై, కరోనా పరిస్థితిపై సోనియా వారితో చర్చించారు. ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించబడింది, దీనిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటుగా కాంగ్రెస్ అగ్ర నాయకులు పాల్గొన్నారు.

Krishna

Krishna

Next Story