JP Nadda: కాంగ్రెస్‌ నేతల ఆరోపణలు ఖండించిన జేపీ నడ్డా

JP Nadda: కాంగ్రెస్‌ అగ్రనేతలు చేసిన ఆరోపణలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు.

Arun Chilukuri
Updated on: 21 March 2024 8:15 PM IST
Congress can use the Black Money from all Their Scams
X

JP Nadda: కాంగ్రెస్‌ నేతల ఆరోపణలు ఖండించిన జేపీ నడ్డా

JP Nadda: కాంగ్రెస్‌ అగ్రనేతలు చేసిన ఆరోపణలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండించారు. వారి ఆర్థిక అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకే హస్తం పార్టీ నేతలు కొత్త స్వరాన్ని అందుకున్నారని విమర్శించారు. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేసినా... గతంలో వివిధ స్కామ్‌ల ద్వారా సంపాదించిన మొత్తాన్ని ఎన్నికల కోసం వినియోగించుకోవచ్చని ఎక్స్‌లో ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు పూర్తిగా విస్మరిస్తారని అన్నారు. తమ తప్పులను సరిదిద్దుకోకుండా, అధికారులను, వ్యవస్థలను నిందించడం సరికాదని హితవు పలికారు. నిబంధనల ప్రకారం పన్ను చెల్లించకుండా తాత్సారం చేస్తుంటే అధికారులు చర్యలు తీసుకోరా.. అని ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story