I-N-D-I-A Alliance: దూకుడు పెంచుతోన్న విపక్ష ఇండియా కూటమి.. ఈనెలాఖరులో ముంబైలో మరో సమావేశం

Congress Announces Plan To Contest All Delhi Lok Sabha Seats
x

I-N-D-I-A Alliance: దూకుడు పెంచుతోన్న విపక్ష ఇండియా కూటమి.. ఈనెలాఖరులో ముంబైలో మరో సమావేశం

Highlights

I-N-D-I-A Alliance: అల్కా లంబా ప్రకటనపై దిద్దుబాటు చర్యలకు దిగిన కాంగ్రెస్

I-N-D-I-A Alliance: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విపక్ష ఇండియా కూటమి దూకుడు పెంచుతోంది. ఈ నెలాఖరులో ముంబైలో మరో సమావేశానికి సిద్ధమవుతోంది. ఆగస్టు 31 తర్వాత ఈ సమావేశం ఉండనుందని.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించారు. సమావేశం జరిగిన మరుసటి రోజే బహిరంగ సభకు కూడా ప్లాన్‌ చేస్తోంది ఇండియా కూటమి.

ఇక ఇండియా కూటమిలో ఢిల్లీ కాంగ్రెస్ నేత అల్కా లంబా ప్రకటన కలకలం రేపింది. ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాల్లో పోటీకి సిద్ధం కావాలని.. పార్టీ అధిష్టానం పిలుపునిచ్చినట్లు ప్రకటించారు అల్కా లంబా. దాంతో ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగిన కాంగ్రెస్.. అది కేవలం అల్కా లంబా సొంత అభిప్రాయమని చెబుతోంది. అయితే పొత్తులపై అంతిమ నిర్ణయం తీసుకునేవరకు స్పష్టత ఉండదంటున్నారు ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories