Lok Sabha Elections 2024: ఆప్‌ తో కాంగ్రెస్‌ పొత్తు ఖరారు

Delhi: ఏడు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ 3, ఆప్‌ 4 స్థానాల్లో పోటీ

Jyothi
Published on: 22 Feb 2024 12:55 PM IST
Congress Alliance with AAP
X

Lok Sabha Elections 2024: ఆప్‌ తో కాంగ్రెస్‌ పొత్తు ఖరారు

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సంబంధించి అన్ని పార్టీల్లోనూ ఉత్సాహం నెలకొంది. తాజాగా ఆమ్‌ఆద్మీ పార్టీతో కాంగ్రెస్‌ పొత్తు కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య కూడా సీట్ల పంపకం ఖరారైనట్లు తెలుస్తోంది. ఢిల్లీ, గుజరాత్, అసోం, హర్యానాలోని లోక్‌సభ స్థానాల టికెట్ల కేటాయింపుపై కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీపార్టీల మధ్య ఒప్పందం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఆమ్‌ఆద్మీపార్టీ, నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్‌ మూడు స్థానాల్లో పోటీ చేయనుంది. గుజరాత్‌లో ఆమ్‌ఆద్మీపార్టీకి కాంగ్రెస్‌ రెండు సీట్లు ఇవ్వగా.. హర్యానా, అసోంలో ఒక్కో సీటు కేటాయించేందుకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

Jyothi

Jyothi

Next Story