Ashwini Vaishnav: అశ్వినీ వైష్ణవ్‌ పనితీరుపై అభినందనలు..మూడు రోజులూ సంఘటనా స్థలంలోనే కేంద్ర మంత్రి

Congratulations on Ashwini Vaishnav  performance The Union Minister was at the Scene all three Days
x

Ashwini Vaishnav: అశ్వినీ వైష్ణవ్‌ పనితీరుపై అభినందనలు..మూడు రోజులూ సంఘటనా స్థలంలోనే కేంద్ర మంత్రి

Highlights

Ashwini Vaishnav: ప్రమాదం జరిగిన రోజునుంచి పునురుద్ధరణ వరకు సమన్వయం

Ashwini Vaishnav: ఒడిశా బాలాసోర్‌ రైలు ప్రమాదం జరిగినప్పటి నుంచి అందరి నోళ్లలో నానుతున్న పేరు ఒకటే.. అదే అశ్వినీ వైష్ణవ్‌.. అవును రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న వైష్ణవ్‌ ఎల్లెడలా తానే అయి వ్యవహరించారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు, వైద్య సాయం.. మృతదేహాల తరలింపు తదితర పనులన్నీ సమన్వయం చేస్తూ వచ్చారు. స్వయంగా మంత్రే సంఘటనా స్థలంలో ఉండడంతో అధికారులు కూడా చాలా కమిటెడ్‌గా పనిచేశారు. దీంతో అంత పెద్ద ప్రమాదం జరిగినా రికార్డ్‌ సమయంలో కేవలం 51 గంటల్లో ట్రాక్‌ పునరుద్ధరణ జరిగింది. ప్రమాదం జరిగింది మొదలు విరిగిన పట్టాలు సరిచేయించి.. రైలు మళ్లీ పట్టాలెక్కే వరకు పట్టు వదలని విక్రమార్కుడిలా పనిచేసిన అశ్వినీ వైష్ణవ్‌ను అందరూ అభినందిస్తున్నారు. రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో జన్మించిన అశ్వినీవైష్ణవ్‌ ఓ మాజీ ఐఏఎస్‌ అధికారి. ఐఏఎస్‌ అధికారిగా ఒడిశాలోనే పనిచేసిన వైష్ణవ్‌.. ఒడిశా నుంచే బీజేపీ తరపున రాజ్యసభకు ఎన్నిక కావడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories